Jet Airways flight skids off runway at Indore airport, passengers safe

Jet airways plane skids off runway at indore airport

Jet Airways, Jet Airways flight, Indore airport, Indore, Delhi, Flight 9W 2793, Indore airport runway

A Jet Airways flight with 66 passengers and four crew members skidded off the runway at the Indore airport

పైలట్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం..

Posted: 05/08/2016 08:58 AM IST
Jet airways plane skids off runway at indore airport

జైపూర్ విమానాశ్రయంలో మరో పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతోన్న విమానం ఒక్కసారిగా రన్ వే నుంచి పక్కకు జరిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో విమానంలోని 66 మంది ప్రయానకిులు తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహిరించడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది సహా అందరూ చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పైప్రాణాలు పై నుంచే పోయే పరిస్థితి నుంచి అందరూ బయటపడటంతో ఒక్కసారిగా అక్కడ బతికిపోయాం దేవుడా అన్న వాతావరణం అలుముకుంది.

వివరాల్లోకి వెళ్తే ఇండోర్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9డబ్ల్యూ 2793 విమానం 66 మంది ప్యాసింజర్లతో ఢిల్లీ నుంచి ఇండోర్ కు వచ్చింది. సిమెంట్ సర్ఫేస్ రన్ వేపై ల్యాండ్ అవుతుండగా పక్కకు జారిపోయిందని, నలుగురు సిబ్బంది సహా 66 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. వాహనాల ద్వారా ప్రయాణికులను టెర్మినల్ కు తరలించామని, తుప్పల్లోకి జారిపోయిన విమానాన్ని ఇంజనీర్లు పరీక్షిస్తున్నారని పేర్కొంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jet Airways Plane  66 Passengers  Skids Off Runway  Indore Airport  

Other Articles