eating less leads to super sex drive

Eat less to boost your sex life

eat less to boast sex life, calorie conscious, study, sex life, cut tension, lose weight, calorie restriction, researchers, Pennington Biomedical Research Centre, Louisiana, Corby Martin

According to an interesting study, eating less can not only help people lose weight, calorie restriction can improve mood and cut tension, leading to super sex drive.

శృంగార సామర్థ్యం పెంచుకోవాలా..? ఈ చిట్కా పాటిస్తే సరి..

Posted: 05/07/2016 07:14 PM IST
Eat less to boost your sex life

మీరు హెల్త్ కాన్షియస్ పర్సెనా..? ముపై అయిదేళ్లు దాటిన వారు చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారిలో మీరు వున్నారా? అందుకోసం అటు వ్యాయామంతో పాటు ఇటు అహారపు అలవాట్లను కూడా మర్చాకుంటున్నారే. మితంగా తింటూ.. బరువు కూడా తగ్గించుకుంటున్నారా.. అయితే మంచిదే. ఎందుకంటే.. అలా చేయడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. తక్కువగా తినడం వల్ల మూడ్ బాగుంటుందని, టెన్షన్ తగ్గుతుందని, ఫలితంగా సంసార జీవితం చాలా బాగుంటుందని చెబుతున్నారు.

ఇందుకోసం 218 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ఆహారపు అలవాట్లను రెండేళ్ల పాటు లూసియానాలోని పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ వాళ్లు పరిశీలించారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు వాళ్లకు భోజనాన్ని క్రమంగా 25 శాతం తగ్గించారు. మరో గ్రూపు వాళ్లకు మాత్రం మామూలు భోజనమే పెట్టించారు. వాళ్లలో భోజనం తక్కువగా తీసుకున్నవాళ్లు తమ సంసార జీవితాన్ని అంతకుముందు కంటే బాగా ఆస్వాదించినట్లు చెప్పారు. మిగిలినవాళ్లు మాత్రం మామూలుగానే ఉన్నారు.

భోజనాలు తగ్గించినవాళ్లకు బరువు కూడా తగ్గి నిద్ర బాగా పట్టినట్లు తెలిపారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదని, దాంతో సంసార జీవితంపై కూడా దాని ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పరిశోధన వివరాలు జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అలాగే ఒకవేళ భాగస్వామి తక్కువగా తింటూ.. ఆ విషయంలో చురుగ్గా ఉంటే, వాళ్ల భార్య/భర్త కూడా అదే అలవాటు చేసుకుంటారని కూడా మరో పరిశోధనలో తేలింది. దీన్ని సోషల్ మోడలింగ్ అంటారని, ఇది ఈమధ్య కాలంలో బాగా ఎక్కువైందని కూడా పరిశోధకులు చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles