ఆ హీరోయిన్ భర్తతో ఐఎఎస్ అధికారిణి | IAS Officer with that heroine husband

Ias officer with that heroine husband

Poojitha, Ator Poojitha, IAS Rekharani, Vijaygopal, విజయ్ గోపాల్, రేఖారాణి, పూజిత, యాక్టర్ పూజిత

former Heroine, tv actor Poojitha complaints to police about her husband. As per poojitha version, Vijay Gopal married her, after few years he leaved her. After that he get marry with an IAS officer.

ఆ హీరోయిన్ భర్తతో ఐఎఎస్ అధికారిణి

Posted: 05/03/2016 03:48 PM IST
Ias officer with that heroine husband

ఒక‌ప్పటి సినీ హీరోయిన్‌, నేటి బుల్లి తెర యాక్టర్ పూజిత త‌న‌కు అన్యాయం జ‌రిగిందంటూ, ఈ విష‌యమై త‌న‌కి ప్రాణ‌హాని ఉందంటూ మీడియాని ఆశ్రయించారు.. గ‌తంలో తన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని 13 సంవ‌త్సరాలు త‌న‌తో కాపురం చేసి ఓ బిడ్డ కూడా పుట్టాక, ఇప్పుడు నన్ను మోసం చేసి ఓ ఐ.ఎ.ఎస్ అధికారిని పెళ్లిచేసుకున్నాడంటూ వాపోయింది పూజిత‌.. ఇదే విష‌యం పోలీసుల‌కు తెలియ‌జేయ‌గా వాళ్ళు తిరిగి న‌న్నే ఎన్‌కౌంట‌ర్ చేసి చంపుతాం అంటూ బెదిరించార‌ని తెలిపింది.

ఓ ఎంపి ద‌గ్గర పి.ఎ.గా ప‌నిచేసే విజ‌య్ గోపాల్ ఇప్పుడు ఓ ఐఎఎస్‌ ఆఫీసర్‌ రేఖారాణిని పెళ్లి చేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు.త‌న‌కు త‌న బిడ్డకి ప్రాణహాని ఉందంటూ త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఆమె పోలీసులను కోరుతోంది. అయితే పూజిత వ్యాఖ్యల‌పై స్పందించిన ఐఎఎస్‌ ఆఫీసర్‌ రేఖారాణి విజయ్ గోపాల్, పూజిత పదేళ్ల క్రితమే విడిపోయారని.. వారిద్దరికీ వివాహం జరగలేదని... కేవలం సహజీవనం చేశారని అన్నారు. తాను అన్ని లీగల్గా చూసుకునే ఈ పెళ్లి చేసుకున్నా అని తెలిపింది. మరో పక్క విజయ్ గోపాల్ కూడా తాను పూజితతో సహజీవనం మాత్రమే చేశానని చెప్పుకొచ్చాడు. మరి చూడాలి పూజిత వ్యవహారం ఎలాంటి కీలక మలుపులు తిరుగుతుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles