Qatar husband divorces wife because of dancing

Husband observes wife dancing gives divorce

Divorce, Dancing, Saudi media, Qatar, husband divorces wife, wife dancing leads to divorce, domestic voilence, women harrasment

saudi media states that a man divorces to his wife, after saw she was dancing to the song breaking all the wedding promises

డైవర్స్ కావాలా..? డాన్స్ చేస్తే చాలు.. ఇదో చిత్రం

Posted: 05/03/2016 12:58 PM IST
Husband observes wife dancing gives divorce

భార్యాభర్తల బంధం నూరేల్ల బంధం అని అందరికీ తెలిసిన విషయమే. అయితే వారిరువురి మధ్య చిన్నపాటి గొడవలు జరగడం మామూలే.. అలా జరగకపోతే అది కాపురమే కాదని పెద్దలంటుంటారు. అయితే భార్యభర్తలు ఎవరు ఎవరిపై కస్సు మన్న దాని వెనుక దాగుంది మాత్రం వారిపై ప్రేమే అంటారు. అలాకాని పక్షంలో అది కమిట్మెంట్ కాపురమేనని ఇటీవల ఓ తెలుగుసినిమాలో డైలాగ్ కూడా వుంది. కానీ పెళ్లి బంధం గురించి తెలిసో, తెలియకో.. లేక ఇంకా తమ మతచాంధాసవాదం కట్టిన గోడలను చీల్చుకుని బయటకు రాలేని కొందరి వల్ల ఆ బంధానికి బీటాలు వారుతున్నాయి.

మామూలుగా భార్యభర్తల మద్య పెద్ద జగడాలు జరిగినా పెద్దలు, కుటుంబసభ్యుల సమక్షంలో వాటిని పరిష్కరించుకుంటున్నారు, కానీ విడాకులు వరకు వెళ్లడానికి ఈ రోజుల్లో ఎవరూ సిద్ధంగా ఉండడం లేదు. అయితే, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన భర్తను గమనించకుండా పెద్ద శబ్దంతో పాటలను వింటున్నందుకు ఓ భర్త భార్యకు విడాకుల్చిన ఘటన అప్పట్లో సౌదీలో చోటుచేసుకుంది. తాజాగా ఖతార్‌లో మాత్రం ఓ భర్త తన భార్య డ్యాన్స్ చేస్తుందని విడాకులు ఇచ్చేశాడు. భక్తి చానళ్లు తప్ప వేరే చానళ్లు ఏవీ చూడకూడదని పెళ్లి అయిన కొత్తలో ఆమె చేత ప్రమాణం చేయించుకున్నాడు సదరు భర్త.

అయితే ఓ చానల్‌లో తనకిష్టమైన పాట వస్తుండడంతో తనను తాను తమాయించుకోలేక ఆమె కాలు కదిపింది. సరిగ్గా అదే సమయానికి ఆఫీసు నుంచి వచ్చిన భర్త అది చూసి కోపోద్రిక్తుడయ్యాడు. నా ఆజ్ఞను పట్టించుకోవా అంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. వెంటనే విడాకులు కూడా ఇచ్చేశాడు. పెళ్లినాటి ప్రమాణాలను మరచి, తనను మోసం చేసిన భార్యను క్షమించేదిలేదని కూడా స్పష్టం చేశాడు. అయితే ఈ విషయాన్ని వెల్లడించిన సౌదీ మీడియా ఆ భార్యభర్తల వివరాలు మాత్రం వెల్లడించలేదు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles