Kangana finally records statement with cops in Hrithik's FIR

Hrithik hacked into my email account kangana

Actress, Kangana Ranaut, statement, record, hrithik roshan, controversy, private emails, hack, susanne khan, adyayan suman, aditya pancholi

Actress Kangana Ranaut on Saturday gave her statement to police in connection with an FIR filed by superstar Hrithik Roshan that an online impostor has been sending e-mails under his guise to his fans, a police official said.

హృతిక్-కంగనా లోగ్గుటు విచారణ అధికారులకెరుక

Posted: 05/01/2016 11:34 AM IST
Hrithik hacked into my email account kangana

బాలీవుడ్ ప్రముఖ నటీనటుల ప్రేమ వ్యవహారం రోజుకో రూపం దాల్చుతుండటంతో విచారణ చేపడుతున్న దర్యాప్తు బృందం కూడా అడుగుముందుకు వేసింది. ఈ విషయంలో నటుడు హృతిక్ రోషన్ తన విషయంలో చేసిన అనేక చట్టవ్యతిరేక పనులపై ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్యాప్తు బృందానికి విచారణలో తెలిపింది. తన ఈమెయిల్ హ్యాక్ చేసినట్లు స్పష్టం చేసింది. వీరిద్దరి మధ్య నడుస్తున్న కేసు విషయంలో దర్యాప్తు బృందానికి ఇచ్చిన వివరణలో ఆమె ఈ విషయం పేర్కొంది.

కంగనా తరుపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ ఆ వివరాలు తెలియజేశారు. ఆయన చెప్పిన ప్రకారం పోలీసుల ముందు వివరణ ఇచ్చేందుకు కంగనా ఆమె సోదరి రంగోలితో కలిసి వెళ్లారు. 'కంగనా, ఆమె సోదరి వివరణ పట్ల పోలీసులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఎందుకంటే తాను ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో హృతిక్ పలు అంశాలను పేర్కోనలేదని, అయితే కంగనా అన్ని అంశాలను తన వివరణలో ఇచ్చారని దీంతో పలు కొత్త అంశాలు ఇప్పుడు పోలీసులకు తెలిశాయన్నారు.

అసలు హృతిక్ ఓ వ్యక్తి యొక్క వ్యక్తిగత అంశాలను ఎందుకు అలా బహిరంగం చేశారనే విషయం గుర్తించకుండానే చాలా విషయాలు ముందుకెళ్లాయి' అని ఆయన చెప్పారు. వీరిద్దరి మధ్య తారస్థాయికి చేరిన వివాదాలు అటు పలువురు బాలీవుడ్ నటీనటులను కూడా ఇబ్బందులు పెట్టాయి, ఈ విషయంలో తన మద్దతు తన మాజీ భర్తకే వుంటుందని సుసానే ఖాను కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ వివాదంలో పోలీసులు కంగనా వాంగ్మూలాన్ని నమోదుచుసుకోవడం ఇది రెండోవసారి. అంతకుముందు గత సోమవారం, ఏప్రిల్ 18న ఒకసారి పోలీసులే నేరుగా కంగనా ఇంటి వద్దకు వెళ్లి ఆమె వివరణ తీసుకున్న విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Hrithik Roshan  private emails  hack  

Other Articles