Karnam Balarama Krishnamurthy opposes TDP akarsh policy

Karnam dissatisfied with party operation aakarsh policy

Karnam Balarama Krishnamurthy, karanam venkatesh, TDP, Operation akarsh policy, Jagan mohan reddy, YSRCP, Ravi kumar, defection, Prakasam district, Addanki constituency, Martur assembly seat, decade long political rival

TDP leader Karnam Balarama Krishnamurthy opposes his owm party Operation Akarsh Policy, Questions how can he work with decade long political rival.

గొట్టిపాటి పార్టీ ఫిరాయింపుపై.. టీడీపీ నేత కరణం సంచలన వ్యాఖ్యలు

Posted: 04/27/2016 12:16 PM IST
Karnam dissatisfied with party operation aakarsh policy

చంద్రబాబు చెప్పిన అకర్ష థీయరీపై ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరామ కృష్ణమూర్తి అసంతృప్తిగా వున్నారని తెలుస్తుంది. గత పదేళ్లుగా ఆయనను ప్రధాన ప్రత్యర్థగా భావించి.. పార్టీని కాపాడుకునే పనితో పాటు కార్యకర్తలను కూడా కాపాడుకుంటూ వచ్చిన తమకు టీడీపీ అకర్ష్ విధానంతో తేరుకోలేకపోతున్నమని అయన అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రత్యర్థి, పార్టీ ప్రత్యర్థిగా పేర్కోన్న వ్యక్తులను టీడీపీ పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయన వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారు. ఆకర్ష పథకంతో భవిష్యత్తులో టీడీపీ కూడా చాలా నష్టపోయే అవకాశాలున్నాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవడం కోసం, ఆస్తులను పరిరక్షించుకోవడం కొసమే కొందరు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పార్టీలో చేరితే తప్పుడు మార్గంలో సంపాదించిన సొమ్మును కాపాడుకోవచ్చని చూస్తున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై పరోక్షంగా ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీలో గొట్టిపాటి చేరికను వ్యతిరేకిస్తున్న బలరాం ఆ విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని నిరోధించడానికి పదునైన చట్టాలుండాలని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం అలాంటి చట్టం తీసుకొస్తే ఇలాంటి పిల్లిమొగ్గలు, ఫిరాయింపులు ఉండవన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని టీడీపీలో చేర్చుకునే విధానంలోనే లోపముందని ఏకంగా చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న ఆకర్ష్ విధానాన్ని ఆయన తప్పుబట్టారు. ఇన్నాళ్లు ప్రత్యర్థిగా వున్న నాయకుడితో తాము ఎలా కలసి పనిచేస్తామని ఆయన ప్రశ్నించారు.

కాగా, ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం కూడా ఆయన తన ఆకర్ష విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  ‘‘ప్రభుత్వాన్నే కూల్చేస్తామంటూ విపక్షం బరి తెగిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? విపక్షం ఆ స్థాయికి వెళ్లినప్పుడు చూస్తూ ఊరుకోలేం కదా? అందుకే ‘ఆకర్ష్’కు తెర తీశాం. సీనియర్లుగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోవాల్సిందే’’ అని చంద్రబాబు చెప్పాడాన్ని కూడా ఆయన సమర్థించలేకపోతున్నారు. రాష్ట్రస్థాయిలో నేతలకు నియోజకవర్గస్థాయి కార్యకర్తల మనోభావాలకు అనుగూణంగా మసులుకోవాలి కానీ.. ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరుగడంతో తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ వుండదని.. దీంతో కలసి పనిచేయడమే మంచిదని చంద్రబాబు సూచించడం కూడా కరణం బలరాంకు మింగుడుపడటం లేదు. గొట్టిపాటి చేరికను అద్దంకి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పిన విషయాన్ని కూడా చంద్రబాబు లైట్ గా తీసుకున్నట్లు సమాచారం. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆకర్ష్ విధానంతో మళ్లీ అదే పరిస్థితి వస్తుందంటే ఆందోళన చెందుతున్నారని కరణం బలరాం చెప్పారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles