టిఆర్ఎస్ ప్లీనరీలో 32 రకాల వంటల లిస్ట్ ఇదే | This is the food menu in TRS plenary

This is the food menu in trs plenary

TRS, Plenary, Khammam, Food, Food in TRS Plenary, TRS Plenary, టిఆర్ఎస్ ప్లీనరీ, ప్లీనరీ, ప్లీనరీలో వంటలు

In TRS plenary at Khammam, party leaders offering delicious food. Total 32 varities in this menu. Food prepared for 12 to 15 thousand members.

టిఆర్ఎస్ ప్లీనరీలో 32 రకాల వంటల లిస్ట్ ఇదే

Posted: 04/27/2016 12:07 PM IST
This is the food menu in trs plenary

ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే అతిథుల కోసం విభిన్నమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. అతిథుల కోసం తెలంగాణ, ఆంధ్రా స్టైల్లో వంటకాలు సిద్ధమవుతున్నాయి. ప్లీనరీ ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ నేతలు.. వంటకాలను సైతం అందుకు తగినట్లుగానే సిద్ధం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరయ్యే వారి కోసం నోరూరించే వంటలు సిద్ధమవుతున్నాయి. ప్లీనరీలో ఉదయం ఏడు గంటల నుంచి అల్పాహారాన్ని అందిస్తారు. అల్పాహారంగా ఇడ్లీ, వడ, ఉప్మా- పెసరట్టు, పొంగలి, కొబ్బరి చెట్నీ, పల్లీ చెట్నీ, అల్లం చెట్నీ, కారంపొడి, సాంబార్, నెయ్యి, టీ, కాఫీ ఇవ్వనున్నారు. ప్లీనరీ వేదికపై ఉన్నవారికి ఉదయం 10 గంటలకు మజ్జిగ, 11 గంటలకు రాగిజొన్న మిక్స్‌డ్ జావ, మధ్యాహ్నం 2 గంటలకు స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించారు.

సాయంత్రం 4 గంటలకు టీ లేదా బాదంపాలు అందిస్తారు. ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు ఉదయం 11 గంటలకు మజ్జిగ, సాయంత్రం 3 గంటలకు స్నాక్స్, సాయంత్రం 4 గంటలకు మజ్జిగ సరఫరా చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఇందులో తవ్వా స్వీట్, బెల్లం జిలేబీ, సన్‌రైజ్ పుడింగ్, కట్లెట్, గారె, కొత్తిమీర, టమాటా చట్నీ, వెజ్‌టబుల్ బిర్యానీ, పన్నీర్ కుర్మా, పెరుగు చట్నీ, వైట్‌రైస్, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, వంకాయ పూర్ణం, గుమ్మడికాయ ఇగురు, ముంజల కర్రీ, బీరకాయ శనగపప్పు కర్రీ, మెంతి మజ్జిగ, పప్పుచారు, ముద్దపప్పు, పచ్చి పులుసు, మిర్యాలరసం, నల్లకారం, నెయ్యి, ఉలవచారు, గుడ్డు, క్రీం, నాటుకోడి పులుసు, మటన్ ధమ్‌బిర్యానీ, దాల్చ, గోంగూర మటన్, చింతచిగురు రొయ్యలు, కొర్రమీను పులుసు వంటి 32 రకాల పదార్థాలను అందించనున్నారు. వీటితో పాటు.. బ్రెడ్ హల్వా, ఐస్ క్రీం, వెజ్‌ రోల్, వైట్‌ రైస్, మటన్ కర్రీ, మెంతి చికెన్, గుత్తి వంకాయ, క్యాప్సికం పకోడా ఫ్రై, బీరకాయ, దొండకాయ, రోటీ చట్నీ, పెసరపప్పు టమాట, చీమచింతకాయ ఫ్రై, చామదుంప పులుసు, ముద్దపప్పు, పచ్చి పులుసు, పప్పుచారు, అప్పడం, పెరుగు, నెయ్యి వంటి 18 పదార్థాలను అందించనున్నారు. మొత్తం 12 నుంచి 15 వేల మందికి తగినట్లుగా నోరూరించే వంటలు సిద్ధం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles