uttarakhand | bjp | congress | rajendra bhandari | jeet ram | bjp lucrative offers | assemlby ticket | rajya sabha seat

Bjp offered us rs 50 cr rs ticket alleges congress mlas

uttarakhand, harish rawath, BJP, Rs 50 crores, congress, rajendra bhandari, jeet ram, bjp lucrative offers, assemlby ticket, rajya sabha seat, BJP leader Satpal Maharaj, deputy speaker Anusuya Prasad Maikhuri, BJP spokesman Munna Singh Chauhan

Congress MLAs Rajendra Bhandari and Jeet Ram, said "all sorts of lucrative offers, including cash up to Rs 50 crore, ticket for a family member in the assembly elections and a Rajya Sabha seat, are being made to us by the BJP".

బీజేపికి మద్దతు ఇస్తే.. రూ. 50 కోట్లు, ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామన్నారు..

Posted: 04/27/2016 09:15 AM IST
Bjp offered us rs 50 cr rs ticket alleges congress mlas

తాము కేంద్రంలో అధికారంలోకి చ్చిన నాటి నుంచి అవినీతిని రూపుమాపామని చెప్పుకుంటున్న బీజేపి.. ఉత్తరాఖాండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగోట్టి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అక్రమాల బాటను పట్టక తప్పడం లేదు. అది ఎంతలా అంటే.. ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్ల రూపాయలను ఆపర్ చేయడంతో పాటు.. రానున్న ఎన్నికలలో పార్టీ టిక్కెట్ కూడా ఇచ్చేందుకు హామిలు కూడా ఇస్తున్నారు. ఉత్తరాఖండ్ లో కాంగ్రస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు కారణంగా చెప్పిన అవినీతికే బీజేపి పాల్పడతుంది.

సాక్షాత్తు కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపిస్తున్నాడని, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయని అరోపించారు. అందుకనే అక్కడ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశామని చెప్పారు. అయితే అధారాలు లేకుండా అదే ఎమ్మెల్యేలతో బీజేపి సాగిస్తున్న బేరసారాలపై వెంకయ్య ఎందుకు నోరు విప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్రపతి పాలన విధింపుపై ఉత్తరాఖండ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కేంద్రానికి, రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ లకు మొట్టికాయలు వేసింది.

ఈ నెల 29న ఉత్తరాఖండ్ లో బలనిరూపణ చేసుకోవాలని హరీష్ రావత్ ప్రభుత్వానికి న్యాయస్థానం అవకాశాన్ని అందించింది. దీంతో బీజేపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బతీసి తమ మార్కు రాజకీయానికి తెరలేపాలని యోచిస్తున్న సమయంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపి అఫర్ ను బహిర్గతం చేశారు. తమకు 50 కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందంటూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాంబు పేల్చారు. ఎమ్మెల్యేలు రాజేంద్ర భండారి, జీత్ రామ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.

'50 కోట్ల రూపాయల వరకు డబ్బు ఇస్తామని బీజేపీ నాయకులు ప్రలోభపెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్, రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారు' అంటూ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో చెప్పారు. వీరిద్దరితో పాటు డిప్యూటీ స్పీకర్ అనుసూయ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. బీజేపీ నాయకుడు సత్పాల్ మహారాజ్తో ఉన్న సంబంధాలు వ్యక్తిగతమైనవని, రాజకీయపరమైనవి కావని భండారి, జీత్ రామ్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు 2.5 కోట్ల నుంచి బేరం మొదలుపెట్టి 50 కోట్ల రూపాయలకు పెంచారని, తమను ఎవరూ కొనలేరని భండారి చెప్పారు.
 
జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Rs 50 crores  Uttarakhand  Congress MLAs  rajendra bhandari  jeet ram  

Other Articles