Hrithik Roshan, Kangana Ranaut leaked pic adds new twist to spat

Hrithik roshan kangana ranaut s intimate picture leaked

kangana ranaut, hrithik roshan, kangana, kangana ranaut, hrithik, kangana ranaut hrithik roshan, kangana ranaut news, hrithik roshan news, kangana ranaut hrithik roshan news, kangana hrithik news, kangana ranaut emails, hrithik roshan emails, entertainment news

After the leaks of Kangana Ranaut's alleged email with Hrithik Roshan, it's a leaked intimate picture of the duo that has started doing the rounds on social media.

ఫోటో లీక్: కంగనాకు దెగ్గరగా హృతిక్.. అఫైర్ వివాదంలో మరో తాజా ట్విస్ట్..

Posted: 04/26/2016 09:54 PM IST
Hrithik roshan kangana ranaut s intimate picture leaked

బాలీవుడ్ సిల్వర్ స్ర్కీన్ పై నటీనటులుగా రాణిస్తున్న హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లు తమ నిజజీవితంలోనూ నడిపిన లవ్ ఎఫైర్ కు భీటాలు వారి లీగల్ వివాదం చిక్కుకున్న నేపథ్యంలో రోజురోజుకు ఈ వివాదం వికృతరూపం దాలుస్తోంది. రోజు రోజుకు హృతిక్-కంగన 'ఎఫైర్' కు సంబంధించి అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వివాదంలో మొదటినుంచి హృతిక్ ఒకటే మాట చెప్తున్నాడు. తనకు కంగనతో వృత్తిపరమైన సంబంధమే కానీ, వ్యక్తిగత అనుబంధం లేదని, ఆమెతో ఎప్పుడూ తాను ప్రేమాయణం సాగించలేదని వాదిస్తున్నా, బయటపడుతున్న వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా వున్నాయి.

ఇటీవల నటి కంగనా తన న్యూడ్ ఫోటోను హృతిక్ కు పంపి మరీ తన ప్రేమను అంగీకరించాలని ఎమెషనల్ బ్లాక్ మెయిల్ చేసిందన్న వార్త బయటకు రాగా, తాజాగా వారిద్దరూ కలసి వున్న చిత్రాలు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో వివాదం రోజురోజుకు ముదరిపాకాన పడుతుంది. తన లాయర్ ద్వారా కంగనకు ఇచ్చిన నోటీసులోనూ 'తాను, కంగన కలిసి రెండు చిత్రాల్లో నటించానని.. మా మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని.. అంతకుమించి సామాజిక, వ్యక్తిగత, ప్రేమ, సాన్నిహిత్య సంబంధం మా మధ్య లేనేలేదని హృతిక్ స్పష్టం చేశాడు.

అయితే, కంగన మాత్రం తమ డేటింగ్‌ సంబంధించి గట్టి ఆధారాలు ఉన్నాయని చెప్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్ లైన్ లో లీకైన ఓ ఫొటో హల్‌చల్‌ చేస్తోంది. కంగనను హృతిక్ ఆత్మీయంగా చుట్టుకొని ముద్దుపెడుతున్నట్టు ఉన్న ఈ ఘాటైన ఫొటో.. వీరి వివాదంలో మరింత ఆజ్యం పోసింది. క్రిష్ సినిమా ప్రి-ప్రొడక్షన్ సందర్భంగా ఓ ప్రవేటు పార్టీలో ఈ ఇద్దరు సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఈ ఫొటో తీసినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్లమీడియా వెల్లడించింది.

అసలు కంగనతో తనకు వ్యక్తిగతంగా ఏ సంబంధం లేదంటున్న హృత్తిక్‌.. ఈ ఫొటోలో ఏం చేస్తున్నట్టు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఫొటో ఆధారంగా వీరిద్దరు డేటింగ్ చేశారా? అన్నది అంత క్లారిటీగా  చెప్పలేమని ఈ వివాదాన్ని దగ్గర చూస్తున్న పరిశీలకులు అంటున్నారు. కానీ, ఈ ఫొటో మాత్రం హృతిక్-కంగన వివాదంలో కొత్త ట్విస్టు ఇచ్చింది. హృతిక్ చెప్తున్నట్టు కంగన ఒక్కరే వన్ సైడ్ లవ్ చేయలేదని ఈ ఫొటో వెల్లడిస్తున్నదని అంటున్నారు. మరి దీనిపై హృతిక్ ఎలా స్పందిస్తాడో కూడా వేచి చూడాలి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hrithik Roshan  Kangana Ranaut  leaked photo  hruthik kangana affair  celebrities  bollywood  

Other Articles