slippers thrown at actor manobala in jayalalithaa own constituency

Slipper thrown at actor manobala

slipper thrown, Actor Manobala, AIADMK, Election campaign, Manobala actor, jayalalithaa, RK Nagar, celebrities, kollywood

the pulse of voters of tamilnadu are in favour of present government says pre polls surveys, but the incident which took place on actor manobala doesnt show the sama in jayalalithaa own constituency Rk nagar.

ప్రముఖ నటుడికి చేదు అనుభవం.. చెప్పులు విసిరిన ప్రజలు..

Posted: 04/26/2016 03:15 PM IST
Slipper thrown at actor manobala

తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో అధికార అన్నాడిఎంకే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రీ ఫోల్స్ సర్వేలలో స్పష్టం అవుతుండగా, అక్కడి పరిస్థితులలో మాత్రం కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. తమిళనాడుతో తామంటే తామే అధికారంలోకి వస్తామని అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా. కెప్టెన్ విజయకాంత్ ఒక్క అడుగు ముందుకేసి మే 19న తాను మదురైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని ప్రకటించి.. రాజకీయ విమర్శకుల చేత ముందేకూసిన గోరింక అనిపించుకున్నాడు.

తమిళనాడులో ముఖ్యంగా త్రిముఖ పోటీ నెలకొందన్న వార్తల నేపథ్యంలో అన్ని పార్టీలు విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొంత ప్రతికూలత మూటగట్టుకుని ఎన్నికల ప్రహసనం లోకి అడుగుపెట్టిన డీఎంకే కూడా రమారమి అన్ని పార్టీలతో సమానంగానే పయనిస్తుందని వార్తలందుతున్నాయి. అయితే ప్రీ ఫోల్ సర్వేల ప్రకారం అన్నా డిఎంకే మళ్లీ అధికారాని చేపడుతుందా..? అన్న అంశమై మాత్రం కొద్దిగా సందిగ్దత నెలకొంది. ఆ పార్టీ ప్రచారం కార్యక్రమంలో జరగిన పరాభవాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

స్వయంగా అన్నా డీఎంకే పార్టీ అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బరిలో నిలిచిన అర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి పరాభవాలు ఎదురుకావడం.. ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ ఉనికినే ప్రశ్నించేట్లుగా వుంది. జయలలిత తరుపున అన్నాడీఎంకే పార్టీ ప్రచారంలో భాగంగా ఆర్కేనగర్ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నటుడు మనోబాలాకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మనోబాలపై అక్కడి ప్రజలు చెప్పులు విసిరి తమ ప్రకోపాన్ని చాటారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జయలలిత నియోజకవర్గానికి వచ్చిన ఆయన ఓపెన్‌ టాప్ జీపులో ప్రసంగం చేసుకుంటూ ముందుకు కదులుతూ వాషర్‌మెన్‌పేటలోకి అడుగుపెట్టారు. ఆయన ప్రచారాన్ని అడ్డుకునేందుకు గుర్తుతెలియని అగంతకులు అదే సమయంలో మనోబాల మేడపై నుంచి చెప్పులను విసిరేశారు. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని మనోబాలా తన ప్రసంగాన్ని ఆపేసి చెప్పులు వేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన అన్నాడీఎంకే కార్యకర్తలు అగంతకుల కోసం వెతకడం ఆరంబించడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles