పెళ్లి కూతురి కోరిక విని అందరూ షాక్..! | bride in MP wants 10,000 saplings as wedding gift

Bride in mp wants 10 000 saplings as wedding gift

Bride, Madhyapradesh, plants, Priyanka, Ravi Chauhan, మధ్యప్రదేశ్, ప్రియాంక, పెళ్లికూతురు

A 22-year-old woman in rural Madhya Pradesh surprised her family and in-laws with an unusual pre-wedding condition – planting 10,000 saplings instead of gold ornaments or cash.The green demand made by Priyanka Bhadoriya – a science graduate and resident of Kisipura village in Bhind district – was quickly accepted by the groom, Ravi Chauhan, and the couple got married on Friday.

పెళ్లి కూతురి కోరిక విని అందరూ షాక్..!

Posted: 04/26/2016 03:13 PM IST
Bride in mp wants 10 000 saplings as wedding gift

పెళ్లిలో ఆడ పెళ్లివారు అబ్బాయికీ, మగ పెళ్లీ వారు అమ్మాయికీ కానుకలు చదివించడం సహజం. అయితే, 22 ఏళ్ల అమ్మాయి, పెళ్లి పీటలు ఎక్కబోతున్న తరుణంలో తన కాబోయే అత్తమామలను ఒక వింత కోరిక కోరింది. తానేమి ఆ అత్తామామలను వజ్రాలు వైఢుర్యాలు కావాలని కోరలేదు.కార్లు, బంగాళాలు, బంగారం కావాలని అడగలేదు. ఇవన్ని కాకుండా కేవలం 10,000 మొక్కల్ని నాటించమని అడిగింది...!! ఇది విన్నవారంతా ఆవాక్ అయ్యారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ లోని భిండ్ లో చోటు చేసుకుంది. ఆమె ఎవరంటే కిషిపురా అనే గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రియాంకా భడొరియా.

అక్కడ ఆచారం ప్రకారం వధువుని తనకు కావలసిన నగలో లేక ఇంకోటో పెళ్లి కానుకగా మగపెళ్లి వారు ఇస్తారు. ఇలా మగ పెళ్లివారు వచ్చి ప్రియాంకాను ఏమి కావాలి? అని అడడితే ఆమె తనకు నగలు, డబ్బులు ఏమీ వద్దు ... 10,000 మొక్కల్ని నాటించండి.. అని కోరింది. దీనికి వారు సంతోషంగా అంగీకరించారు. 5,000 మొక్కలని తన తల్లి గారి ఇంటి వద్ద, 5,000 మొక్కల్ని తన అత్త వారి ఇంటి వద్ద ఉంచి అక్కడ చుట్టు పక్కల వారికి పంచి ఇచ్చింది ప్రియాంకా. కరువు వల్ల తన తండ్రి పడిన కష్టాలను చూస్తూ వచ్చిన ప్రియాంకా చిన్నప్పటి నుంచి ఎన్నో మొక్కలను నాటుతూ వచ్చింది. మరో విశేషం ఏమిటంటే, ఆమె వివాహం ఎర్త్ డే రోజునే జరిగింది. ఆమె ముందు చూపు కీ, పర్యావరణం పట్ల అవగాహన చూసి ఆమె భర్త రాజీవ్ చౌహాన్ మురిసిపోయాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles