పెళ్లి ఆపండి అన్న పోలీసులు.. తాళి కట్టిన వరుడు | Police tried to stop marriage in Tirumala

Police tried to stop marriage in tirumala

Tirumala, Police, Nellore, Dakkili,తిరుమల, జనార్దన్, పెళ్లి

In Tirumala, police tried to stop marriage. Janardhan named person from Nellore dist got marriage at tirumala in cinema style.

పెళ్లి ఆపండి అన్న పోలీసులు.. తాళి కట్టిన వరుడు

Posted: 04/22/2016 04:28 PM IST
Police tried to stop marriage in tirumala

తిరుమలలో ఓ పెళ్లి సినిమా స్టైల్లో జరిగింది. సినిమాల్లో చూపించినట్లు పెళ్లి మండపంలో బంధువుల కోలాహలం మధ్య జరుగుతున్న పెళ్లికి అనుకోని అతిథులుగా వచ్చారు. పోలీసులు. పోలీసులను చూసి ముందు షాకైన పెళ్లి వారు అసలు విషయం ఆరా తీద్దామనుకునేలోపు.. పెళ్లి ఆపండి అంటూ వారు అరిచారు. దాంతో అక్కడికి వచ్చిన వాళ్లంతా షాకయ్యారు. ఇదంతా నిజంగానే జరుగుతోందా లేదంటే ఏదైనా సినిమాల్లో చూపిస్తున్న సీనా అని అనుకున్నారు. కానీ తర్వాత వాళ్లు రియలైజ్ అయ్యారు. నిజంగానే పోలీసులు పెళ్లి ఆపడానికే వచ్చారని తెలుసుకున్నారు. తిరుమలలో జరిగిన ఈ డిఫరెంట్ పెళ్లి గురించి మొత్తం తెలుసుకోండి.

నెల్లూరు జిల్లా డక్కిలికి చెందిన జనార్ధన్‌కు తిరుమలలో వివాహం జరగాల్సి ఉంది. అంతలో అక్కడికి డక్కిలి ఎస్సై తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదంటూ అడ్డుతగిలారు. జనార్దన్‌కు మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఆమెను కాదని మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయితే, అందుకు ఆధారాలు చూపాలని, ఎవరో చెప్పిన మాటలను నమ్మి పెళ్లి చెడగొట్టటం తగదని జనార్దన్ కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. రెండు వర్గాల మధ్య వాదులాట జరుగుతుండగా.. అంతలో వరుడు అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. దాంతో ఆగ్రహంతో ఎస్సై వారి మీద కోపగించుకోవడంతో పెళ్లికి వచ్చిన వారు దాడికి పాల్పడ్డారుఆగ్రహంగా వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో జనార్దన్ తరఫు వారు ఆయనపై దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు అక్కడికి చేరుకుని, వారిని సముదాయించారు. ఈ గొడవతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala  Police  Nellore  Dakkili  తిరుమల  జనార్దన్  పెళ్లి  

Other Articles