చంద్రబాబుకు షాకిచ్చిన మంత్రి | AP minister gave shock to CM Chandrababu Naidu

Ap minister gave shock to cm chandrababu naidu

Ayyanapatrudu, chandrbababu, Ranking,Ministers Ranking, చంద్రబాబు, ర్యాంకింగ్, ర్యాంకులు, ఏపి, అయ్యన్నపాత్రుడు

AP Panchayath Raj Minister Ayyanna Patrudu gave shock to CM Chandrababu Naidu. He got first rank in central ranking. But ob before chandrababu announce tenth rank for him.

చంద్రబాబుకు షాకిచ్చిన మంత్రి

Posted: 04/22/2016 01:41 PM IST
Ap minister gave shock to cm chandrababu naidu

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకే షాకిచ్చారో మంత్రి. తాజాగా ఏపి సిఎం ప్రకటించిన ర్యాంకుల గోల తీవ్ర దుమారాన్ని రేపింది అని అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు అనుయాయుడిగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి నారాయణకు చివరి ర్యాంకు రావడం,  మొన్నటి దాకా మంత్రి పదవి ఊడుతుంది అనుకున్న పీతల సుజాతకు ఏకంగా మొదటి ర్యాంకు రావడం సర్వే మీద అనుమానాలకు తావిచ్చింది. అర్థపర్థంలేని కొలమానాలతో మంత్రులకు ర్యాంకు ఎలా ఇస్తారని, ర్యాంకింగ్ తో మంత్రి వర్గంలో అగాధాలకు చంద్రబాబు అవకాశం కల్నిస్తున్నారని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు మంత్రుల‌కు ర్యాంకులు తర్వాత పంచాయ‌తీ రాజ్ శాఖ‌ల ప‌నితీరుపై స‌ర్వే నిర్వహించిన కేంద్రం.. వాటి ఫ‌లితాల‌ను విడుదల చేసింది. ఈ ఫ‌లితాల్లో ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడికి మొదటి ర్యాంకు వ‌చ్చింది. సీఎం స్వయంగా ప‌దో ర్యాంకు ఇస్తే.. కేంద్రం ఏకంగా మొదటి ర్యాంకు ఇవ్వడంపై అంద‌రూ ఆశ్చర్యపోతున్నారు. డిజిటల్ పంచాయితీలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, ఆన్ లైన్ సేవలు, గ్రామాల వారీగా మాస్టర్ ప్లాన్ తయరు చేయించడం వంటి పనులను పంచాయితీ రాజ్ శాఖ చాలా చక్కగా అమలు చేస్తున్నందున జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు వ‌చ్చిందని కేంద్రం ప్రక‌ట‌న‌లో తెలిపింది. మొత్తానికి చంద్రబాబుకే అయ్యన్న పాత్రులు షాకిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles