మనిషిని కరిచిన కుక్క చచ్చిపోయింది | Dog died after bite a man

Dog died after bite a man

Dog, Dog bite, Kadapa, కడప, కుక్క, మనిషి

In Kadapa dist of AP, Died after dite a man. After bite a man dog suffered with some health problems. Then dog died off.

మనిషిని కరిచిన కుక్క చచ్చిపోయింది

Posted: 04/22/2016 01:38 PM IST
Dog died after bite a man

కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు… మనిషి కుక్కను కరిస్తే వార్త… అని టీవీ ఛానల్స్ లో చాలా సార్లు చూసి ఉంటాం. అచ్చంగా అలాగే కాదు గానీ, దానికి మరికొంత తీవ్రత యాడ్ అయిన స్టోరీ ఇది… ఇది గురువారం కడప జిల్లాలో జరిగిన సంఘటన. కడప జిల్లా, పుల్లంపేట మండలం, అనంతంపల్లె సమీపంలోని చాపల దళితవాడ… ఓ వ్యక్తి కాస్త తిక్క తిక్కగా మాట్లాడేవాడు… సరిగ్గా మాట్లాడేవాడు కాదు… తను ఓ వీథిలో వెళ్తుంటే, పిల్లలతో ఉన్న ఓ వీథి కుక్క భయానికి గురై తన పిల్లలను కాపాడుకోవటానికి అతనిపై దాడి చేసింది… కరిచింది… గాయపరిచింది… తనకేం బాగానే ఉన్నాడు… కానీ ట్విస్ట్ ఏమిటంటే… అతన్ని కరిచిన కుక్క మాత్రం పది నిమిషాలకే నురగలు కక్కుతూ, ఆయాసపడుతూ కాసేపటికే ప్రాణాలు వదిలేసింది… కుక్క కళేబరాన్ని బయట పారేశారు…

ఇంతకీ కుక్క కరవడం మనిషికి ప్రమాదకరమా? మనిషిని కరవడం కుక్కకు ప్రమాదకరమా? నిజానికి ఏం జరిగింది? ఒకవేళ తనకు ఏదైనా రోగముండి ఉంటే, అది అంత త్వరగా కరిచిన కుక్కనే బలి తీసుకునేంత ప్రమాదకరమైందా? నిజంగానే రోగిష్టి మనిషిని కరిస్తే కుక్కకూ అది సోకి వెంటనే మరణిస్తుందా? నిజంగానే అది అంత ప్రమాదకరమైన రోగమై ఉంటే తను బాగానే బతుకుతున్నాడు కదా…? మరి ఏం జరిగింది?  మిస్టరీ..!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dog  Dog bite  Kadapa  కడప  కుక్క  మనిషి  

Other Articles