New Twist in Puri Jagannadh and Loafer Movie Distributors Case

Distributor ramadasu denies attack on puri jagannath

Puri Jagannath attack, new twist in puri agannadh case, loafer movies distributors, Muthyala Ramadasu, Loafer, Varun Tej, loafer distributors, loafer movie distributors, puri jagannadh, puri jagannath, celebrities, movies, music, headlines, gossips, news, bollywood

Amidst allegations of attacking Tollywood director Puri Jagannath, Cine distributor Muthyala Ramadasu has come forward to clear the rumours. Responding to the allegations, Ramadasu clarified that he has no reason to attack Puri Jagannath.

‘పూరి’ కేసులో ట్విస్టు.. దాడి చేయలేదన్న డిస్టిబ్యూటర్లు

Posted: 04/18/2016 12:36 PM IST
Distributor ramadasu denies attack on puri jagannath

దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారన్న కేసులో మరో కొత్త ట్విస్టు చేటుచేసుకుంది, పూరి జగన్నాథ్ తమపై తప్పడు కేసు పెట్టారని, ఆయనపై తాము అసలు దాడే జరపలేదని లోఫర్  సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు. 'లోఫర్' సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత సి.కల్యాణ్ ను అడిగామని తెలిపారు. పూరి జగన్నాథ్ ఇంటికి అసలు తాము వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.

నిర్మాత తరువాత దర్శకుడినే తాము డబ్బులు అడుగుతామని తెలుసుకున్న పూరి జగన్నాథ్.. ఓ సినిమా కథను తనంతట తాను రాసుకుని తమపై ఆరు సెక్షన్ల కింద ఏకపక్షంగా కేసులు నమోదు చేశారని అరోపించారు, పూరి జగన్నాథ్ కు బాగా తెలిసిన ఓ పోలీసు ఉన్నతాధికారి ఈ విషయంలో ఆయనకు సహాయసహకారాలను అందంచారని వారు అరోపించారు. అయితే కేసు నమోదు కావడం పెద్ద విషయం కాదని, దాని దర్యాప్తు కూడా చేయాల్సి వుంటుందని, ఈ క్రమంలో దర్యాప్తులో అన్ని విషయాలు తేటతెల్లం అవుతాయని చెప్పారు.  

పూరి జగన్నాథ్ పై దాడి చేశారని చెబుతున్న డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ లు అసలు రోజున హైదరాబాద్ లోనే లేరని వెల్లడించారు. పోలీసు అధికారులు కావాలంటే పూరి జగన్నాథ్ ఇంట్లో వున్న సిసి కెమెరాలను పరిశీలిస్తే నిజానిజాలు స్పష్టం అవుతాయని చెప్పారు. పోలీసులు కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండా ఇంత ఏకపక్షంగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు. సినిమా విజయవంతమయితే లాభాల్లో 20 శాతమే తమకు ఇస్తారని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కనీసం 20 శాతం డబ్బులు వెనక్కు ఇవ్వాలని వేడుకుంటున్నామని అన్నారు.

రజనీకాంత్, సూర్య, మహేశ్ బాబు తమ సినిమాలు ఫ్లాప్ అయినప్పడు డబ్బులు వెనక్కు తిరిగిచ్చేసిన విషయాలను వారు గుర్తు చేశారు. 'అఖిల్' విడుదలైన తరువాత ఆ సినిమాపై ప్లాప్ టాక్ రాగానే రెండో రోజునే దర్శకుడు వివి వినాయక్ తమకు ఫోన్ చేసి 'మీ వెనుక నేనున్నాను' అంటూ భరోసా యిచ్చారని వెల్లడించారు. తాము కూడా సినిమా పరిశ్రమలో భాగమేనని, తమను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సినిమా నిర్మాత, దర్శకుల తరువాత ఆ సినిమాను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే వాళ్లము తామేనంటూ చెప్పుకోచ్చారు, సినిమా తీయడంతో వారి పని ముగిస్తే.. అప్పటి నుంచే తమ పని ప్రారంభం అవుతుందని, తమ సంక్షేమం కూడా నిర్మాత, దర్శకులు అలోచించాలన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannath  Muthyala Ramadasu  Loafer  Varun Tej  

Other Articles