KCR spellbound by Lakshmi Srija, gifts Rs 10 lakh

Cm blessed the child prodigy gifts rs 10 lakh

Chief Minister KCR, class III student from Khammam, Kumari Lakshmi Srija, Telangana History, Kakatiya Dynasty, formation of separate State, present Government, Council of Ministers, child prodigy, gifts Rs 10,16,000, wonder kid, Telangana history, indian history, tspsc, general studies, prime ministers names, presidents names, andhra pradesh history

From Kakatiya Dynasty to the formation of separate State Srija impressed Hon'ble CM with her amazing memory and grasp of Telangana matters

ITEMVIDEOS: శ్రీజ మేధోశక్తికి ముగ్ధుడైన సీఎం.. రూ. పది లక్షల బహుమానం

Posted: 04/11/2016 12:54 PM IST
Cm blessed the child prodigy gifts rs 10 lakh

లక్ష్మీ శ్రీజ... ఖమ్మం జిల్లాలకు చెందిన చిన్నారి. మూడో తరగతిలోనే తన అత్యంత అద్భుతమైన మేధోసంపత్తితో సత్తా చాటుకుంటూ ముందుకుసాగుతోంది. కాకతీయుల కాలం నాటి స్వర్ణయుగం, శాతవాహనుల పాలనా దక్షత, నిజాం నవాబుల హయాంలోని ప్రగతి, సమైక్య రాష్ట్రం-తెలంగాణ ఉద్యమం.. ఒక్కటేమిటి ఇలా అనేక విషయాలను ఓ చిన్నారి ధారాళంగా చెబుతుంది. అబ్బరుపరిచే చిన్నారి మేధోసంపత్తికి ముగ్దుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బాలికతో పాటు అమె తల్లిదండ్రులను తమ కార్యాలయానికి ఆహ్వానించారు, అంతేకాదు, తన సొంత ఖాతా నుంచి అప్పటికప్పుడు 10 లక్షల 16 రూపాయల చెక్కిచ్చారు. వారిని విందుకు ఆహ్వానించారు. కలిసి భోజనం చేశారు. వీలుచూసుకుని శ్రీజ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి, బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు.

ఖమ్మంకు చెందిన కిరణ్‌కుమార్, సుధారాణి దంపతుల కూతురు లక్ష్మీ శ్రీజ.. ఎన్నో విషయాలను గుర్తుంచుకుని తిరిగి చెప్పడంలో దిట్ట. పాప ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తెలంగాణ చరిత్రతో పాటు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించేవారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పేర్లు ఇలా అనేక విషయాలను అలవోకగా శ్రీజ చెప్పేస్తుంది. ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీజ తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలిశారు. ముందుగా చెప్పినవే కాకుండా అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెప్పే తీరును చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wonder kid  memory power  telangana history  laxmi srija  cm kcr  indian history  tspsc  

Other Articles