Panama papers sensation in all over world

Panama papers sensation in all over world

Panama, Panama Papers, World, Black money

A huge batch of reports late Sunday linked 140 public figures, executives and celebrities around the world to overseas assets in offshore tax havens ranging from the British Virgin Islands to Panama. Iceland’s prime minister has resigned, while Russian President Vladimir Putin’s spokesman deflected criticism. More political pressure is likely to follow.

ITEMVIDEOS: నల్లకుబేరులను హడలెత్తిస్తున్న పనామా పేపర్స్

Posted: 04/06/2016 11:16 AM IST
Panama papers sensation in all over world

కొట్ల పత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నల్లధన కుబేరుల చిట్టాను పనామా పేపర్స్ బట్టబయలు చేసింది. ఈ పేపర్స్ వెల్లడించిన వివరాలు సర్వాత్రా ఆసక్తిని రేపుతున్నాయి. ఈ పనామా పత్రాలు భారత్ లోనూ పెద్ద తలకాయల పేర్లను బయటపెట్టాయి. ఈ పత్రాల దెబ్బకు ఇప్పటికే ఐస్ ల్యాండ్ ప్రధాని గున్‌లాగ్‌సన్ తన పదవికి రాజీనామా చేశారు. చిలీలో అవినీతి నిఘాసంస్థ ట్రాన్‌సరెంట్ చిలీ అధిపతి గొంజాలో డెలావ్యూ కూడా తప్పుకున్నాడు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ ఇరకాటంలో తండ్లాడుతున్నాడు. కానీ భారత్ లో పట్టుబడ్డవారు మాత్రం ఇంకా అబద్దం అనే చెబుతున్నారు.

పనామా పేపర్లు సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలకు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అవినీతి చక్రవర్తుల బాగోతాల గట్టురట్టు చేస్తూ పనామా పేపర్లు సృష్టిస్తున్న పెను రాజకీయ విలయానికి ఐస్‌లాండ్‌లో మొదటి ప్రభుత్వం పతనమయ్యింది. పనామా పత్రాల్లో పేరు వెల్లడి కావడంతో ప్రజల నిరసలకు తలొగ్గిన ఐస్‌లాడ్‌ ప్రధాని సిగ్నండర్‌ డేవిడ్‌ గున్లాగ్‌సన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఐస్‌లాండ్‌ ప్రధాని సిగ్నండర్‌ డేవిడ్‌ గున్లాగ్‌సన్‌, ఆయన భార్య అన్నాసిగుర్‌లాగ్‌ పల్స్‌డోట్టిర్‌ అఫ్‌షోర్‌ కంపెనీల్లో మిలియన్ల డాలర్లు వెనకేసుకున్నారని పనామా పత్రాల్లో ఆరోపించడంతో... ప్రజాగ్రహానికి గురయ్యారు. సిగ్నండర్‌ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. వీధుల్లోకి వచ్చిన భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఐస్‌లాండ్‌ రాజధాని రెక్‌జావిక్‌లోని అధ్యక్ష భవనపై కోడిగుడ్లు, పెరుగు డబ్బాలు విసిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజాగ్రహానికి తలొగ్గిన సిగ్మండర్‌ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మోన్సాక్‌ ఫోన్సెకా బయటపెట్టిన ఈ జాబితాలో మోటూరి శ్రీనివాస ప్రసాద్‌ 2011లో నమోదైన నాలుగు సంస్థల్లో విదేశీ డైరెక్టర్లుగా కొనసాగుతోంటే,  మరో ఇద్దరు వోలం భాస్కరరావు, భావనాశి జయ కుమార్‌లు ఎస్‌డి వెంచర్స్‌, సికా సెక్యురిటీస్‌, భాసు కేపిటల్స్‌, బీపీ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌లో వాటాదారులుగా పేర్కొంది. అయితే వీరు చట్టబద్ధంగా తమ ధనాన్ని దాచుకున్నారా? లేక అది నల్లధనమా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పనామాలో తెలుగోళ్ల పేర్లు బయటకురావటం హైదరాబాద్ వ్యాపారవర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.కాగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ దేశాలను వదిలి పన్ను స్వర్గాల్లాంటి విదేశాల్లో డమ్మీ కంపెనీలు పెట్టి, వాటిలోకి ఇన్వెస్ట్‌మెంట్లు తరలించిన వ్యవహారంలో భారతీయులకు సంబంధించి నిన్న రెండో జాబితా బయట పడిన విషయం తెలిసిందే.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panama  Panama Papers  World  Black money  

Other Articles