First semi-high-speed train to hit tracks today

First semi high speed train to hit tracks today

Semi High Speed Train, India, India Railways, Gatimaan, Hazrat Nizamuddin to Agra

India’s first semi-high-speed train, Gatimaan, will run from Hazrat Nizamuddin to Agra on Tuesday. Capable of running at a maximum speed of 160 kmph, Gatimaan will reach Agra in 100 minutes during which the passengers will be shown airline-style hospitality.

భారతదేశపు తొలి సెమీ హైస్పీడ్‌ రైలు షురూ

Posted: 04/05/2016 01:04 PM IST
First semi high speed train to hit tracks today

వేగంగా అడుగులు వేస్తున్న భారత్ కు మరింత వేగంగా ప్రయాణించే రైళ్లు కావాలి. ఇండియన్ రైల్వేల్లో వేగం పెంచడానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయించగా.. నిన్నటి దాకా దాని ఫలితాలు కనిపించలేదు. కానీ తొలిసారి భారతదేశపు సెమీ హైస్పీడ్‌ రైలు ‘గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఢిల్లీ, ఆగ్రాల మధ్య పరుగులు పెట్టబోతుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలు, ఢిల్లీ (నిజాముద్దీన్‌ స్టేషన్‌) - ఆగ్రా స్టేషన్ల మధ్య 184 కిలోమీటర్ల దూరాన్ని ఇది 105 నుంచి 110 నిమిషాల్లో అధిగమిస్తుంది.

ఈ రైల్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రైలులోకి అడుగుపెట్టగానే ఎదురువచ్చి, పూలతో స్వాగతం పలికే హోస్టెస్‌ . ప్రతిసీటు ముందు ఓ 8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్. ఎలాంటి అసౌకర్యం కలగకుండా దూసుకుపోయే వేగం...విమానాల్లో సేవలకు దీటైన సేవలు... 12+2 ఫైర్‌ఫ్రూఫ్‌ మెటరీయల్‌ కోచ్‌ లు, ఆటోమేటిక్‌గా మ్రోగే అత్యవసర అలారం...దేశ, విదేశీ ఆహార పదార్థాలు వెజ్‌, నాన్ వెజ్‌లతో పాటు బేకరీ ఐటెమ్స్‌ కూడా ఇందులో లభిస్తాయి.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Semi High Speed Train  India  India Railways  Gatimaan  Hazrat Nizamuddin to Agra  

Other Articles