Karnataka Governor refuses to meet former PM Deve Gowda, JD(S) left embarrassed

Deve gowda hits out at governor s secretariat

former Prime Minister, H D Deve Gowda, State and Central government offices, Governor Vajubhai Vala, JD(S) national president, padayatra, Mahatma Gandhi statue, Freedom Park, abolish Anti-Corruption Bureau (ACB), Raj Bhavan, former Gujarat Assembly Speakers age, governer rest and relax, British colonial slavery,

Twenty years after having been sworn-in as a Prime Minister, H D Deve Gowda had enjoyed uninhibited access to all the State and Central government offices.

మాజీ ప్రధాని దేవేగౌడకు అవమానం, రాజ్ భవన్ లోకి అనుమతి నిరాకరణ

Posted: 04/05/2016 11:27 AM IST
Deve gowda hits out at governor s secretariat

మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడను పరాభవం ఎదురైంది. సుమారుగా 20 ఏళ్ల కిందట దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దేవెగౌడ.. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలోకి వెళ్లలన్నా అడ్డుగోడలు అంటూ లేకుండా స్వేచ్చగా వెళ్తుంటారు. అయితే అలాంటి స్వేచ్ఛకు తన రాష్ట్రంలోనే గవర్నర్ వి.ఆర్‌.వాజూభాయివాలా కారణంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో లోకాయుక్తను నిర్వీర్యం చేసేందుకు ప్రవేశపెట్టిన అవినీతి నిరోదక శాఖను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ వల్లాకు మెమొరండం సమర్పించేందుకు వెళ్లగా రాజ్ భవన్ లోనికి దేవెగౌడ్ ను అనమతించకుండా అవమానించారు.

దేవెగౌడ సమర్పిస్తున్న మెమోరాండంను తీసుకోకుండా తిరస్కరించి గవర్నర్‌ ఆయనను అవమానించారు. రాష్ట్రంలో ఎసిబి ఏర్పాటును వ్యతిరేకిస్తూ దేవెగౌడ తన అనుచరులతో కలిసి ఫ్రీడం పార్కు నుంచి రాజ్‌భవన్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. పలువురు జెడిఎస్‌ శాసన సభ్యులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. గవర్నర్‌ను తాను కలుసుకోవలసిన అవసరాన్ని ఒక్క రోజు ముందగానే రాజ్‌భవన్‌కు సమాచారం అందించానని గౌడ పేర్కొన్నారు. మధ్యాహ్నం 2-3 గంటల మధ్య గవర్నర్‌ను కలుసుకునేందుకు రాజ్‌భవన్‌ వర్గాలు అనుమతిచ్చాయి.

ఆ సమయానికి గౌడ తన సహచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. కాని అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఆ తరువాత కొంతసేపటికి అనుమతించారు. దాదాపు గంటన్నర సేపు గౌడ లోపలే వేచి ఉన్నారు. అయినప్పటికి గౌడను కలుసుకునేందుకు గవర్నర్‌ రాలేదు. గవర్నర్‌ చర్యతో విసుగుపుట్టిన గౌడ రాజ్‌భవన్‌ నుంచి బయటకు వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తన తనయుడు కుమారస్వామి, జనతాదళ్ పార్టీ నేతలతో కలసి రాజ్ భవన్ బయటకు వచ్చిన ఆయన గవర్నర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

గవర్నర్‌ను కలుసుకునేందుకు ఇక ఎన్నడూ రాజ్‌భవన్‌కు రానని, ప్రజా సమస్యలను కోర్టు ముంగిటకు తీసుకువెళ్తానని విలేకరులకు తెలిపారు. కన్నడిగుల పట్ల గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అనేక మంది రాజ్ భవన్ లకు విచ్చేస్తున్నారని అరోపించారు. వయస్సు మీదపడటం కారణంగానే గవర్నర్ నిద్రకు పూనుకున్నాడని, అయితే ఆయనది తనంత వయస్సు కాదని కూడా తెలుసుకోవాలన్నారు. ఈ గవర్నర్ల తీరు బ్రిటీష్ కాలంలోని కొలోనియం బానిసత్వ వ్యవస్థను గుర్తు చేస్తుందన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : H D Deve Gowda  former PM  Vajubhai Vala  Governor  Anti-Corruption Bureau  Raj Bhavan  

Other Articles