Rahul Gandhi meets victims of Kolkata flyover collapse, says he won’t give a political statement

Rahul gandhi visits flyover collapse site meets injured

Kolkata, Kolkata flyover, Kolkata bridge collapse, Kolkata news, rahul Gandhi, rahul Gandhi in Kolkata, Kolkata congress. West Bengal, Bengal elections

Declining to politicise the event, the Congress VP told the press, "Have come here to meet injured, do not want to give a political statement."

ఫ్లైఓవర్ బాధితులను పరామర్శించిన రాహుల్, రాజకీయం లేదట..

Posted: 04/02/2016 05:38 PM IST
Rahul gandhi visits flyover collapse site meets injured

కోల్‌కతా వివేకానంద ఫ్లైఓవర్‌ కూలిన ఘటన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇవాళ సందర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో బాధితులకు అండగా నిలబడేందుకు తాను వచ్చానని, అంతేకానీ రాజకీయాలు చేయడానికి, మాట్లాడటానికి కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కోల్‌కతాలోని ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పోందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

పశ్చిమ్ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ చౌదరీ, పార్టీ నేత దీపాదాస్ మున్సీలతో కలసివచ్చిన ఆయన దుర్ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఎన్డీఆర్ఎఫ్ అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను ఘటనపై ఎలా స్పందిస్తారన్న విషయమై ప్రశ్నించగా, జరిగింది దుర్ఘటనని ముందుగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంభాలకు తాను భరోసా ఇవాల్సిన అవసరం మేరకు వచ్చినట్టు చెప్పారు, ఇక క్షతగాత్రులను పరామర్శించి దైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేందుకే వచ్చానని చెప్పారు,

కాగా.  కోల్‌కతా లో ఫ్లై ఓవర్‌లో కూలిపోయిన ఘటనలో అనేకమంది సామాన్యుల బతుకులు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించిన అనంతరం రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం అసన్సోల్‌లోని కుల్తీ ప్రాంతంలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ కోల్‌కతాలో ఫ్లైఓవర్‌ కూలి చాలామంది చనిపోయారని, దీనిపై రాజకీయాలు చేయకూడదని సీఎం మమతాబెనర్జీ చెప్పారని, అందుకే తాను రాజకీయ ప్రకటనలు చేయడం లేదని పేర్కొన్నారు.

యావత్ దేశాన్ని కుదిపేసిన పశ్చిమ బెంగాల్‌ లోని శారద చిట్‌ఫండ్ కుంభకోణమని, అయితే దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటి అని, అయినా దీనిపై మమత ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కాంగ్రెస్‌-వామపక్షాల పొత్తుతో మరోసారి బెంగాల్ లో మమత సర్కార్‌ రాబోదనే విషయంలో ప్రజలకు అర్థమైందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పించడంపైనే ప్రధానంగా దృష్టిపెడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  kolkata flyover collapse  bengal election  congress  

Other Articles