Masood Azhar Doesn't Meet Criteria To Be Banned As Terrorist: China

China again blocks india s bid at un for ban of jem chief

China,Pakistan,Masood Azhar,United Nations,Liu Jieyi,terrorism,UN sanctions, Pathankot terror attack, Jaish e Mohammad, Pathankot Air Force base, virtual veto

China's Permanent Representative Liu Jieyi has reiterated Beijing's claim that Pakistan-based Jaish-e-Mohamed (JeM) chief Masood Azhar does not qualify as a terrorist who would have to face UN sanctions

చైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందా..? మసూద్ అజార్ ఘటనే ఉదాహరణా..?

Posted: 04/02/2016 05:32 PM IST
China again blocks india s bid at un for ban of jem chief

ఉగ్రవాదులకు స్వర్గధామంలా వున్న పాకిస్థాన్ కు ప్రత్యక్షంగా పాలన, ఆర్థిక ఇత్యాది అంశాలలలో సహాయ సహకారాలను అందిస్తున్న ది సో కాల్డ్ డ్రాగన్ పరోక్షంగా అక్కడి ఉగ్రవాదాన్ని కూడా ప్రోత్సహిస్తుందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అందుకు పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ ఘటనను ఉదాహరణగా తీసుకోవాలని సమాధానాలు వినబడుతున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా దానిని ఉక్కుపాదంలో అణిచి వేయాలన్న ఐక్యరాజ సమితీలోనే తనకున్న శాశ్వత సభ్యత్వం ప్రత్యేక అధికారంతో చైనా ఉగ్రవాదులను రక్షిస్తుంద్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పాకిస్థాన్ లాంటి దేశం సహాయంతో చైనా భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని యత్నిస్తుందన్న అరోపణలు వున్నాయి. పాకిస్థాన్ లో అసరా తీసుకుంటున్న ఉగ్రభూతం పాకిస్థాన్ లోనే అలజడి సృష్టించనట్లే ఏదో ఒకనాడు చైనాను కూడా కబళించివేస్తుందని అనేక మంది శాపనార్థాలు పెడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే.. ఫటాన్ కోట్ ఉగ్రదాడి సూత్రదారి మసూద్ అజార్ ను నిషేధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా వీటో అధికారంతో తిరస్కరించడమే.

చైనా తన ప్రత్యేక అధికారంతో తీర్మాణాన్ని తిరస్కరించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాది అయిన అజార్‌ను కాపాడేందుకు చైనా, పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించింది. సాంకేతిక కారణాలు చూపుతూ చైనా అసమగ్రంగా వ్యవహరించిందని పేర్కొంది. ఉగ్రవాదం అణచివేతపై ఇలాంటి సంకుచిత దృక్పథాన్ని కనబర్చడం ఏమాత్రం సరికాదని, ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అంతర్జాతీయ సమాజం చూపాల్సిన సంకల్పాన్ని ఇది చూపడం లేదని తేల్చిచెప్పింది.

ఐక్యరాజ్యసమితిలో చైనాతో సహా ఐదు అగ్రరాజ్యాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన తర్వాతే భారత్‌కు వ్యతిరేకంగా చైనా ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. జనవరి 2న పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనకు సూత్రధారి అయిన మసూద్ అజార్ ప్రమాదకరమైన ఉగ్రవాది అని, అతన్ని నిషేధించకపోవడం వల్ల భారత్‌ ఇప్పటికీ ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటున్నదని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే చైనా మాత్రం అజార్ ఉగ్రవాది కాదని, అందుకే తాము వీటో ద్వారా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించామని సమర్థించుకుంటోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pathankot terror attack  Masood azhar  Jaish e Mohammad  China  

Other Articles