Paris explosion: Streets evacuated after huge gas blast in apartment block in heart of French capital

Explosion in central paris after domestic accident

Paris, Paris explosion, Explosion in cenral Paris, Terrorism, France, Paris Gas explosion, Paris Rue d’Uzes, Paris 'domestic' accident

A major explosion occurred in a residential building in central Paris leaving numerous casualties. The cause of the blast may have been a gas explosion, a Daily Mail report said.

పారిస్ లో ఆకాశ హార్య్మంలో గ్యాస్ లీకై భారీ విస్పోటనం.. ఐదుగురికి గాయాలు..

Posted: 04/01/2016 06:30 PM IST
Explosion in central paris after domestic accident

సరిగ్గా ఐదు మాసాల క్రితం జరిగిన ఉగ్రదాడి ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పారిస్ లో మారోమారు భారీ విస్పోటనం సంభవించింది. అయితే ఈ విస్పోటనం ఉగ్రవాదుల చర్య కాదని, కేవలం గ్యాస్ లీక్ కావడంతోనే జరిగిందని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. సెంట్రల్ పారిస్లోని ఆరవ జిల్లాలో నివాస సముదాయాల మద్య ఈ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలా జరిగిందన్న విషయం తెలియకపోవడంతో పారిస్ వాసుల్లు ఒక్కసారిగా భయంతో కంపించిపోయారు.

ఈ పెలుడులో పారిస్ లోనే అత్యంత ఎత్తైన భవనం ఆకాశహార్య్మం టూర్ మాంట్ పర్నాస్పీ లో కొంత భాగం దెబ్బతినింది. ఘటనాస్థలి ప్రాంతంలో నివసిస్తున్న వారిని పోలీసులు హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం సంభవించగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు భవనంలో వ్యాపించిన మంటలను అర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ ప్రమాదంలో ఐదుగురు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు.

ప్రాన్సు పోరుగుదేశం బెల్జియం రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగిన జంట పేలుళ్ల ఆనంతరం మెట్రో సబ్ స్టేషన్ లో పేలుళ్లతో సుమారు 36 మందిని ఉగ్రదాడి మట్టుబెట్టిన ఘటన నుంచి అక్కడ హై అలెర్ట్ ప్రకటించారు. సరిగ్గా ఐదు నెలల క్రితం నవంబర్ లో జరిగిన నరమేథంలో 136 మంది ప్రజలు అమరులైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా పారిస్ వాసుల కళ్ల ఎదుట మళ్లీ ఉగ్రభూతం కనిపించినట్లయ్యింది. అయితే ఘటనకు గల కారణాలను మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది,

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles