Kolkata flyover collapse like an act of god, says IVRCL

Kolkata flyover collapse like an act of god says ivrcl

IVRCL, Kolkata, Flyover collapse, Kolkata flyovers, Act Of God

IVRCL Limited, the Hyderabad-based company that is constructing the Kolkata flyover, a portion of which collapsed on Thursday, is yet to ascertain the cause for the collapse, A.G.K. Murthy, Director (Operations), has said.

ITEMVIDEOS: ఫ్లైఓవర్ కూలిందా.. అది ‘యాక్ట్ ఆఫ్ గాడ్’

Posted: 04/01/2016 01:30 PM IST
Kolkata flyover collapse like an act of god says ivrcl

అంతా దేవుడే చేశాడు అని మనం అప్పుడప్పుడు మట్లాడుతుంటాం. కొంత మంది అయితే మన చేతుల్లో ఏముంది అంతా దేవుడు చేసిందే మనం కేవలం నిమిత్తమాత్రులం అంటుంటారు. అయితే తాజగా కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలిపోయింది.  ఈ ఘటనలో దాదాపుగా 21 మంది మృతి చెందగా, 80 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ నిర్మాణాన్ని చేపడుతున్న ఐవీఆర్సీఎల్ సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలు విన్న అందరూ షాక్ కు గురయ్యారు. అంత మంది చావుకు కారణం ఆ సంస్థ నిర్లక్షమే అని అందరూ అంటుంటే ఆ కంపెనీ ప్రతినిధులు మాత్రం వేరే కారణం అంటున్నారు.

తమ సంస్థ గత 27 ఏళ్లుగా ఎన్నో వంతెనలను నిర్మించామని,ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశామని కానీ ఇటువంటి ప్రమాదం ఎన్నడూ చోటుచేసుకోలేదన్నారు. ఘటనాస్థలంలో ఉన్న తమ సంస్థకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు కనిపించటం లేదని, వారికోసం వెతుకుతున్నామన్నారు. ప్రమాదం వెనక నాణ్యత, సాంకేతికపరమైన తప్పిదాలేమీ లేవని.. ఇప్పటికే 70 శాతం వంతెన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కాగా ఈ ఘటన ఎలా జరిగింది అని ప్రశ్నిస్తే మాత్రం యాక్ట్ ఆఫ్ గాడ్ అని అనడం తీవ్ర దుమారానికి తెర తీసింది. మొత్తం 60 పిల్లర్లు నిర్మించామని, 59 పిల్లర్లకు ఏ మెటీరియల్ అయితే వాడామో దానికి కూడా వాడినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మొత్తానికి ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ మరి కంపెనీకి కూడా ఎలా పనిచేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IVRCL  Kolkata  Flyover collapse  Kolkata flyovers  Act Of God  

Other Articles