Virat Kohli is a very lucky person

Virat kohli is a very lucky person

Virat Kohli, Virat, Team India, World Cup T20

Virat got four life chances in T20 World cup Semi finals match with West Indies. West Indies players cant play very well.

అదృష్టం అంటే కోహ్లీదే.. నాలుగు సార్లు లైఫ్

Posted: 03/31/2016 10:43 PM IST
Virat kohli is a very lucky person

టి20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరుగిన సెమీఫైనల్‌లో కోహ్లీ 47 బంతుల్లో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉన్నాయి. రెహానే, ధోనీ కాంబినేషన్‌లో వికెట్ల మధ్య చురుగ్గా పరిగెడుతూ సింగిల్స్, టూ రన్స్ కూడా బాగా చేశాడు. అయితే కోహ్లీ ఎంతలా రాణించినా చాలా సార్లు అదృష్టం కలిసివచ్చి మళ్లీ క్రీజ్ లో నిలబడగలుగుతున్నాడు. విరాట్ కోహ్లీ కొట్టిన షాట్లను క్యాచ్‌ పట్టుకోవడంలో విండీస్ ఫీల్డర్లు ఘోరంగా విఫలమయ్యారు. దాదాపు నాలుగు కీలక షాట్లను ఫీల్డర్లు చేతులారా వదిలేశారు.

బ్రావో బౌలింగ్‌లో రన్ కోసం ప్రయత్నించిన కోహ్లీకి రెండు లైఫ్‌లు రావడం ఒక ఆసక్తికర విషయం. రన్ కోసం ప్రయత్నించిన కోహ్లీ ఆఫ్ పిచ్ దాటెళ్లిపోయిన తర్వాత మరలా వెనక్కు వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో కీపర్ త్రో వేయగా అది మిస్సయింది. కీపర్ త్రో వేసిన బాల్‌ను అందిపుచ్చుకున్న బ్రావో త్రో కోసం ప్రయత్నించాడు. అయితే ఆ త్రో కూడా మిస్సవడంతో హమ్మయ్యా అని టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరోపక్క విండీస్ తో సెమీ ఫైనల్ మ్యాచ్లో విరాట్ (89 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించి.. ట్వంటీ 20ల్లో పదహారవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ 20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఇన్ని అర్థశతకాలు ఏ బ్యాట్మెన్ చేయలేదు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్, బ్రెండన్ మెక కల్లమ్ పేరిట ఉండేది. వీరిద్దరూ టీ 20ల్లో 15 హాఫ్ సెంచరీలు సాధించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Virat  Team India  World Cup T20  

Other Articles