45 people died in Telangana within four days

45 people died in telangana within four days

heavy Temp, temeprature, Heat, Heat Waves

Heavy temeparures causing death to many people. In telangana 45 people died within four days.

తెలంగాణలో నాలుగు రోజుల్లో 45 మంది మృతి

Posted: 03/29/2016 08:21 AM IST
45 people died in telangana within four days

ఎండాకాలం ఎండలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం పూట సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దాంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కాగా ఎండల తీవ్రతకు వడదెబ్బ తగిలి.. జనాలు పిట్టల్లా రాలిపొతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 45 మంది మృత్యువాత పడినట్లు తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నెల 24 నుంచి 27 వరకు వడదెబ్బ మృతులపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది.

ఎండ తీవ్రకు నల్లగొండ జిల్లాలో 18 మంది, కరీంనగర్ జిల్లాలో 9 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు, వరంగల్ జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో నలుగురు మరణించారు. మార్చి నెలలోనే అసాధారణ ఎండలు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 47 డిగ్రీలకు చేరడంతో ఈ మరణాలు సంభవిం చినట్లు అంచనా. ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటున్నారు. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు వీలుగా ప్రయత్నాలు చెయ్యాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక ఎండ తీవ్రత కారణంగా మధ్యాహం పూట కూలి పనులు చేయించడానికి వీలులేదని హైకోర్టు నిన్ననే ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని కూడా ఆదేశాల్లో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heavy Temp  temeprature  Heat  Heat Waves  

Other Articles