Telagana police exam dates announed by State police recruitment board

Telagana police exam dates announed by state police recruitment board

Telangana, Police, Police Recruitment, TS Police

Telangana govt postposned the police and Groups for two months, But State police recruitment board announce the date

పోలీస్ ఉద్యోగాల తేదీలు వచ్చేశాయ్

Posted: 03/29/2016 08:03 AM IST
Telagana police exam dates announed by state police recruitment board

తెలంగాణలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పోలీస్ ఉద్యోగాల భర్తీ మధ్యలోనే నిలిచిపోయింది.. కానీ వాయిదాపడ్డ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష తేదీలను రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 24న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జే పూర్ణచందర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈ పరీక్షను ఏప్రిల్ 3న నిర్వహించాల్సి ఉండగా, అదే రోజు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు కూడా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్ పరీక్ష తేదీని వాయిదా వేసింది.

తాజా తేదీని ఖరారు చేసేందుకు డీజీపీ అనురాగ్‌శర్మతో పాటు ఇతర ఉన్నతాధికారులు సోమవారం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వచ్చే నెల 24న కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన విధంగానే ఎస్‌ఐ, తదితర స్థాయి పోస్టులకు ఏప్రిల్ 17 పరీక్ష నిర్వహిస్తున్నామని, ఆ పరీక్షల తేదీలో ఎలాంటి మార్పు లేదని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు తెలిపారు. కాగా గ్రూప్స్, పోలీస్ పరీక్షలను రెండు నెలలకు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి... 24 గంటల్లోనే తేదీని ప్రకటించింది. మరి గ్రూప్స్ విషయంలో కూడా ఇలానే జరుగుతుందా..? అని చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Police  Police Recruitment  TS Police  

Other Articles