man misses his head 3 times at point-blank range

Assassin misses target s head three times from point blank range

man survive point blank firing, man attacked by personal assassin, Brazilian town, Araguapaz, shopkeeper, Jaire Nato Gonzalo de Sousa, hitman fails firing attempt, video footage, firing attack

A shopkeeper identified as as 35-year-old Jaire Nato Gonzalo de Sousa was opening his store when a hitman attempted to murder him in broad daylight.

ITEMVIDEOS: పాయింట్ బ్లాంక్‌లో మూడు రౌండ్ల కాల్పులు.. అయినా తప్పించుకున్నాడు

Posted: 03/25/2016 06:31 PM IST
Assassin misses target s head three times from point blank range

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న నానుడి బలం చేకూరింది. శివుడ్ని రూపాన్ని దైవంగా పరిగణించకపోయినా.. చేసిన మంచే పరమాత్ముడన్న విషయమే అతన్ని కాపాడింది. అత్యంత సమీపం దుండగులు జరిపిన కాల్పులను తప్పించుకోవడం ఎవరికైనా సాధ్యమేనా? కానీ బ్రెజిల్‌లోని ఓ నగరంలో సరిగ్గా అలాగే జరిగింది. ఓ దుండగుడు ఓ షాపు యజమానిపై పాయింట్ బ్లాంక్ రేంజిలో రివాల్వర్‌తో కాల్పులు జరిపినా, సదరు షాపు యజమాని మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వ్యవహారం మొత్తం మీడియాకు ఎక్కింది. దుండగుడు వచ్చి ధనా ధనా కాలుస్తుంటే ఏం చేయాలో తెలియని షాపు యజమాని చివరకు ఓ కార్డుబోర్డు అట్ట పట్టుకుని దాని వెనకాల దాక్కున్న దృశ్యం కూడా కనిపించింది.

దుండగుడు అంతలా కాల్పులు జరిపినా, కేవలం రెండు బుల్లెట్లు మాత్రమే టార్గెట్‌కు తగిలాయి. వాటిలో ఒకటి తల పక్క నుంచి రాసుకుంటూ వెళ్లిపోయింది. మరో బుల్లెట్ మాత్రం అతడు అడ్డుపెట్టుకున్న కార్డుబోర్డు నుంచి దూసుకెళ్లి పొట్టలో దిగింది. కానీ, వైద్యులు ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్ తీసేశారు. దాంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. బ్రెజిల్‌లోని అరగువాపజ్ నగరంలో ఇదంతా జరిగింది.  బాధితుడు జైరే నాటో గొంజాలో డిసౌజా (35) చిన్న వస్త్రదుకాణం పెట్టుకున్నాడు.

పొద్దున్నే షాపు తెరిచి ఇంకా సర్దుకుంటూ ఉండగానే ఈ దుండగుడు వచ్చి కాల్పులు జరిపాడు. చీపురు, చెత్తబుట్ట తీసుకుని బయటకు వస్తుండగా వెనకనుంచి వచ్చిన దుండగుడు అతడి తలమీద పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చాడు. పదే పదే కాల్చినా.. దుండగుడు టెన్షన్‌లో ఉండటం వల్లో ఏమో గానీ, చాలా షాట్లు మిస్సయ్యాయి. దుండగుడు అక్కడి నుంచి పారిపోయినా... సీసీటీవీ ఫుటేజి చూసిన పోలీసులు.. అతడు ఇప్పటికే ఓ హత్యకేసులో పరారీలో ఉన్న నిందితుడని గుర్తించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brazil firing  point blank range firing  vitim survived  

Other Articles