nandyala member of parliament spy reddy critically ill and unconscious after hypertension

Nandyala mp spy reddy hospitalised after unconscious

nandyala mp spy reddy, spy reddy, suraksha emergency, unconscious, critically ill, member of parliament, Nandyal MP, SPY Reddy, sickness, hypertesion, hyderabad, hospital

Nandyala MP of Kurnool district SPY Reddy is critically ill and was unconscious on Wednesday. He was immediately taken to a private hospital here.

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి అస్వస్థత, హైదరాబాద్ లో మెరుగైన వైద్యం

Posted: 03/24/2016 09:31 AM IST
Nandyala mp spy reddy hospitalised after unconscious

నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయనకు రక్తపోటు అధికం కావడంతో ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ముందుగా స్థానిక సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గతకొంత కాలంగా అస్వస్థతకు గురైన ఆయన కోలుకుని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని గడివేముల మండలం ఉండుట్ల గ్రామంలో 30 ఏళ్ల తర్వాత బుధవారం జరిగిన జాతరలోనూ పాల్గొన్నారు.

అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన ఆస్వస్థతకు గురయ్యారు. అయితే ఎండ తీవ్రతతో రక్తపోటు అధికమై అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు న్యూరాలజిస్ట్ వరదరాజు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ హరినాథరెడ్డి వెళ్లి ఆయనకు వైద్యం చేశారు. ఇదే సమయంలో ఫిట్స్ వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత ఆయన అల్లుడు శ్రీధర్‌రెడ్డి, కుమార్తెలు సుజల, రాణి, మేనల్లుడు రాజగోపాల్‌రెడ్డి హుటాహుటిన అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyal MP  SPY Reddy  sickness  hypertesion  hyderabad  hospital  

Other Articles