Pakistani flag hoisted in Kashmir on national day

Pakistani flag hoisted in kashmir on national day

pakistan, pak flag in Kashmir, Jammu kashmir, pakistan Day

Activists of radical women's outfit Dukhtaran-e-Millat (DeM) on Wednesday hoisted Pakistani flags several places here on the occasion of 'Pakistan Day'. Activists of DeM hoisted Pakistani flags...

కాశ్మీర్ లో పాక్ జెండా ఎగిరింది... వాళ్ల జాతీయ గీతం వినిపించింది

Posted: 03/24/2016 06:34 AM IST
Pakistani flag hoisted in kashmir on national day

మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది. కాశ్మీర్ లో పాకిస్థాన్ అనుకూలం వర్గాలు మరోసారి తీవ్రంగా స్పందించాయి. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా కాశ్మీర్ లో పాక్ జెండా ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది. అసియా అంద్రబీ నేతృత్వంలోని అతివాద మహిళా సంస్థ దుక్తరన్ ఏ మిలాత్ వివిధ ప్రాంతాలలో ఆ దేశ జెండాలను ఎగరేసింది. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్, డౌన్‌టౌన్, సివిల్ లైన్స్‌తో పాటు అనేక ప్రాంతాలలో దుక్తరన్ కార్యకర్తలు పాక్ జెండాను ఎగురవేశారని అధికారులు తెలిపారు. బుచ్‌పోరాలో నిర్వహించిన పాకిస్థాన్ డే కార్యక్రమంలో అంద్రబీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ జాతీయ గీతాన్ని కార్యకర్తలు ఆలపించారు. దేశంలో ఉంటూ.. భారతదేశం నుండి లాభం పొందుతూ పక్క దేశం పౌరులుగా చలామణీ అవుతామని కొంత మంది దుర్మార్గపు ఆలోచన.

గత ఏడు దశాబ్దాలుగా పాకిస్థాన్ డే ఉత్సవాల్లో జమ్ముకశ్మీర్ ముస్లింలు పాల్గొంటున్నారని అంద్రబీ అన్నారు. జమ్ముకశ్మీర్ పాక్‌లో భాగం అని స్పష్టం చేశారే. త్వరలోనే ఆ కల సాకారం కానుంది కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ డే, ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దుక్తరన్ కార్యకర్తలు పాక్ జెండాను ఎగురవేయడం అలవాటుగా మార్చుకున్నారని వారు పేర్కొన్నారు. కాగా, పాక్ జెండాను ఎగురవేసినందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అంద్రబీపై గత ఏడాది కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  pak flag in Kashmir  Jammu kashmir  pakistan Day  

Other Articles