Of Allah’s 99 names, not one stands for violence, says PM Modi

Of allah s 99 names not one stands for violence says pm modi

Modi, Islam, Sufi, Terrorism, Faith of peace, Sufism, Allah

Prime Minister Narendra Modi described Islam as a “faith of peace” and Sufism as one of its greatest contributions, addressing a global audience on the opening day of the World Sufi Forum here on Thursday.

అల్లాకు 99 పేర్లు; నరేంద్ర మోదీ

Posted: 03/18/2016 07:06 AM IST
Of allah s 99 names not one stands for violence says pm modi

అల్లాకు 99 పేర్లు ఉ న్నాయని, ఇందులో ఏ ఒక్కటి కూడా హింసకు ప్రతీకగా లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చె ప్పారు. ఇక్కడ జరుగుతోన్న ప్రపం చ సూఫీ ఫోరంలో గురువారం ఆయన ప్రసంగించారు. హింసో న్మాదానికి పరిష్కారం చూపగలిగే సంవిధానాలు సూఫీయిజంలో ఉ న్నాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించా రు. ఉగ్రవాదం అందరినీ వేరు చేస్తుందని, మనను దెబ్బతీస్తుం దని, ప్రస్తుత దశలో ఉగ్రవాదం, తీవ్రవాదం అత్యంత విధ్వంసకర ఫలితాలను కలుగచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూఫీయిజపు సందేశం ప్రపంచ శాంతికి కీలకంగా మారు తుందని తెలిపారు.

ఉగ్ర వాదం ప్రతి ఏటా అపార నష్టం కలిగి స్తోందని, ఎందరో బలి అవుతున్నా రని గత ఏడాది 90 దేశాలలో ఉగ్ర వాద హింసాత్మక చర్యలు జరిగాయ ని, సిరియాలోని యుద్ధస్థలిలో బలి అయిపోయిన వేలాది మంది తమ పిల్లల కోసం ఎన్నో దేశాలకు చెందిన తల్లిదండ్రులు ప్రతి నిత్యం బాధ పడుతూ గడుపుతున్నారని పేర్కొ న్నారు. హింసాత్మక చర్యలకు నివా రణగా సూఫీ మతం నిలుస్తుందని , ప్రేమను కాంక్షించే వారి కలయికే సూఫీ అని, ఇక్కడి సమ్మేళనం శాంతి సందేశం ఇస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రవాదంతో ఎందరు బలి అయ్యారు? ఎందరు ఇతరత్రా నష్టపోయారు? అనే గణాంకా లను పక్కకు పెడితే , ఇది మొత్తం మానవాళి జీవితాలను ప్రభావితం చేస్తోందని చివరకు తీవ్రవాద, ఉగ్రవాద శక్తులు దేశ సంవిధానాలను, స్వరూపాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని, ఇది ఉగ్రవాద సమస్య సృష్టిస్తోన్న తీవ్ర పరిణామం అని హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరు అందరిదీ అని, ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదని మోడీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Islam  Sufi  Terrorism  Faith of peace  Sufism  Allah  

Other Articles