Hyderabad kid kidnaped in Afteroon and murderd by evening

Hyderabad kid kidnaped in afteroon and murderd by evening

Hyderabad, Abhay, Raja, Sree Colony, Shahinayatgunj

Abhay (15) left his house in Sree Colony of Shahinayatgunj at around 5 p.m. on Wednesday to get idlis for the family members. He rode a two-wheeler, collected idlis and reached close to his house.

హైదరాబాద్ లో మద్యాహం కిడ్నాప్.. రాత్రి మర్డర్

Posted: 03/18/2016 06:59 AM IST
Hyderabad kid kidnaped in afteroon and murderd by evening

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పదో తరగతి విద్యార్థి అభయ్ మోదానీ కిడ్నాప్, హత్య కేసును ఛేదించేందుకు అన్ని కోణాలలో హైదరాబాద్ నగర పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పక్కాప్లాన్ ప్రకారం అభయ్‌ను తీసుకెళ్లి.. డబ్బుల కోసం కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడి.. కిడ్నాపర్లు హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కిడ్నాపైన అభయ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో అల్ఫా హోటల్ వద్ద రాత్రి ఓ అట్టపెట్టలో శవమై కనిపించింది.

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ అభయ్ కిడ్నాప్, మర్డర్ కేసులో విజయవాడలో పోలీసులు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురికి అభయ్ కిడ్నాప్, హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు అభయ్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ పూర్తయింది. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ముక్కులో పేపర్లు కుక్కి ఊపిరి ఆడకుండా చేసినందు వల్లే అభయ్ చనిపోయినట్లు తెలిసింది. తమను అభయ్ గుర్తు పడతాడనే అనుమానంతో కిడ్నాపర్లు.. అభయ్ ను చంపేసి ఉంటారని పోలీసులు సందేహిస్తున్నారు. డబ్బు కోసమ అభయ్ ను చంపేశారని పోలీసులు గుర్తించారు. అభయ్ తండ్రి రాజాసింగ్ కు తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని కూడా పోలీసులు సందేహిస్తున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ ఇద్దరు కూడా దొరికితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కిడ్నాపర్, అభయ్ తండ్రి మధ్య ఫోన్ సంభాషణ..
(రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోలోని సంభాషణ హిందీలో జరిగింది.)
అభయ్ తండ్రి: హలో హలో.. ఎవరు మాట్లాడుతున్నారు అన్నా...
కిడ్నాపర్: కిడ్నాపర్‌ను మాట్లాడుతున్నా...మీకు చెప్పాను కదా డబ్బు కావాలని..
అభయ్ తండ్రి: ఎంత అడిగారు
కిడ్నాపర్: పది కోట్లు.. పది కోట్లు
అభయ్ తండ్రి: అంత ఇవ్వలేం
కిడ్నాపర్: ఎంత ఇస్తారు
అభయ్ తండ్రి: ఇంట్లో ఐదు లక్షల నగదు, కొద్దిగా బంగారం ఉంది అది ఇచ్చేస్తాను
కిడ్నాపర్: అబద్ధాలు చెప్పొద్దు
అభయ్ తండ్రి: నేను అబద్ధాలు ఎందుకు చెప్పుతాను. నా దగ్గర ఉన్నది చెప్పుతున్నాను
కిడ్నాపర్: లాస్ట్‌కు ఎంత ఇస్తావు
అభయ్ తండ్రి: ఇంట్లో అంతా వెతికినా 7,8 లక్షల రూపాయలు, 10, 20 తులాల బంగారం కన్నా ఎక్కువ దొరకదు. ఉన్నదంతా ఇచ్చేస్తా
కిడ్నాపర్: చూడు నేను మీ అబ్బాయిని ఎంతో మంచిగా చూసుకుంటున్నాను.. రేపు అడుగు
అభయ్ తండ్రి: నీ కాళ్ళు పట్టుకుంటా, నీ చేతులు పట్టుకుని దండం పెడతా. నీవు అడిగినంత డబ్బు నా దగ్గర లేదు
కిడ్నాపర్: లాస్ట్ అండ్ ఫైనల్.. ఐదు కోట్లు
అభయ్ తండ్రి: నేను నాంపల్లి వరకు వచ్చినా..నిన్ను కలవాలంటే ఎక్కడికి రావాలి.
కిడ్నాపర్: ఐదు కోట్లు ఇవ్వాలి. మీ వాడిని అడుగు నేను ఎంత మంచిగా చూసుకున్నాను
అభయ్ తండ్రి: ఎక్కడ కలవాలి
కిడ్నాపర్: సికింద్రాబాద్‌కు రావాలి (ఫోన్ కట్)..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Abhay  Raja  Sree Colony  Shahinayatgunj  

Other Articles