YSRCP MLA Buggana Rajendranath Satires on Chandrababu Govt

Ysrcp mla buggana rajendranath satires on chandrababu govt

Buggana Rajendranath, AP, Assembly, Laughs in assembly, Jagan, YSRCP

YSRCP MLA Buggana Rajendranath Satires on Chandrababu Govt. He slams govt through stories. He told that govt position in the ap.

ITEMVIDEOS: చిన్నబాబు రాకపోతాడా.. చేయకపోతాడా

Posted: 03/17/2016 03:23 PM IST
Ysrcp mla buggana rajendranath satires on chandrababu govt

నిన్నటి దాకా వాడీవేడిగా సాగిన ఏపి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా నవ్వులు పూయించారు ఓ ఎమ్మెల్యే. నిన్న తెలంగాణ అసెంబ్లీలో జానారెడ్డి ఎలాగైతే నవ్వులు పూయించారో అలాగే ఏపి అసెంబ్లీలో ఓ వైసీపీ ఎమ్మెల్యే దోమ కథ, నందరాజు కథలు చెప్పి నవ్వులు పూయించారు. అయితే కథలు చెబుతూనే ప్రభుత్వం తీరును ఎడగడుతూ.. కాసేపు ఆహ్వాదకర వాతావరణాన్ని సృష్టించారు ఆ ఎమ్మెల్యే. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి  ఏం కథలు చెప్పారో మీరు కూడా చూడండి.

ముందుగా 'నందోరాజా భవిష్యతి' కథను గుర్తుచేశారు. రైతు రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి, డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి.. ఇలా ప్రతి అంశానికీ అదే మంత్రం పఠిస్తున్నారన్నారు. అది ఏంటంటే, రాజు గారికి ఇద్దరు భార్యలున్నారని, చిన్నభార్య కొడుకు నందుడని అన్నారు. చిన్న భార్యకు ఊళ్లో అన్నిచోట్లా అప్పులేనని, వాటిని ఎప్పుడు తీరుస్తారంటే.. ఏదో ఒక రోజు నందుడు రాజు కాకపోతాడా, అప్పులన్నీ తీర్చకపోతానా అన్నారన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒకరోజు చినబాబు రాకపోతాడా.. రుణమాఫీ చేయకపోతామా, చినబాబు రాకపోతాడా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోతామా అన్నట్లు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

అలాగే, చివర్లో ఒక దోమ కథ కూడా వినిపించారు. పిల్ల దోమ పుట్టిన తర్వాత తొలిసారి ప్రపంచంలోకి వెళ్లి ఒక రోజంతా తిరిగి వచ్చిందని.. వచ్చిన తర్వాత దాని తల్లి దోమ, తండ్రి దోమ కలిసి ప్రపంచం ఎలా ఉందని అడిగారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. దానికి పిల్ల దోమ.. ''నాకింత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మీరు ఇంతవరకు చెప్పనే లేదు, నేను బయటకు వెళ్లగానే అందరూ చప్పట్లు కొడుతున్నారు'' అందని, మన ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. నిన్నటి దాకా హాట్ హాట్ గా ఉన్న అసెంబ్లీ ఒక్కసారిగా ఎండలో వచ్చిన వానలా మార్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Buggana Rajendranath  AP  Assembly  Laughs in assembly  Jagan  YSRCP  

Other Articles