SREEMANTHUDU MAHESH BABUS WIFE VISITED BURRIPALEM

Sreemanthudu mahesh babus wife visited burripalem

mahesh babu, namrata, Namrata Shirodkar, Guntur

Tollywood hero Mahesh Babu’s wife Namrata Shirodkar is all set to visit Burripalem village on Thursday. Burripalem in Guntur district is the native village of Mahesh Babu’s father Superstar Krishna. Mahesh had adopted the village and unveiled a plan to develop it.

ITEMVIDEOS: బుర్రిపాలెంలో మహేష్ బాబు భార్య

Posted: 03/17/2016 01:49 PM IST
Sreemanthudu mahesh babus wife visited burripalem

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో గురువారం సినీనటుడు మహేశ్‌బాబు కుటుంబ సభ్యులు పర్యటించారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్‌బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. దత్తత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌, సోదరి గల్లా పద్మావతి స్థానికులు, అధికారులతో చర్చించారు. మహేశ్‌బాబు కుటుంబ సభ్యులు బుర్రిపాలెం రావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీమంతుడు సినిమా టైంలో తన గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మహేష్ బాబు గతంలోనే ప్రకటించారు. గతంలో మహేష్ బాబు, ప్రకాశ్ రాజ్, మంచు మనోజ్ లాంటి టాలీవుడ్ నటులు తమకు నచ్చిన గ్రామాలను దత్తత తీసుకొని.. వాటిని అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తాజాగా మహేష్ బాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు చర్యలకు దిగారు. ఓ వైపు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నా కానీ తన భార్య, నటి నమత్రా షిరోర్ద్కర్ పర్యవేక్షణలో బుర్రపాలెం బాగోగులను పట్టించుకునేలా చూస్తున్నారు. కాగా త్వరలోనే గ్రామంలో మహేష్ తో కలిసి పర్యటిస్తానని నమత్రా ప్రకటన గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  namrata  Namrata Shirodkar  Guntur  

Other Articles