Rahul Gandhi attacks PM Modi over denial of special status to AP

Rahul gandhi vows to fight for ap special status

Manmohan Singh, Sonia Gandhi, Congress Party, Rahul Gandhi, Andhra Pradesh Special Status, Raghuveera Reddy, Chiranjeevi, Shailajanath, Crore signature, ramachandra reddy, venkanna, pm modi, venkaian naidu, BJP, TDP, chandrababu naidu, ysrcp, Jaganmohan reddy

AICC vice president Rahul Gandhi on Wednesday said the Central government is not interested in supporting the aspirations of people of Andhra Pradesh.

ప్రత్యేకహోదా ఏపీ హక్కు.. కేంద్రం తాత్సారంపై పోరాటం చేద్దాం: కాంగ్రెస్

Posted: 03/17/2016 10:20 AM IST
Rahul gandhi vows to fight for ap special status

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడి సాధిద్దామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వం లో 300 మందితో కూడిన ప్రతినిధి బృందం ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా కోటి సంతకాల సేకరణను, 13 జిల్లాల్లో మట్టి, నీళ్లను సేకరించి ఢిల్లీకి తెసుకువెళ్లారు. కోటి సంతకాల జాబితాలో సోనియా, మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ సంతకాలు చేశారు. సోనియా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్యాయమైన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించి న్యాయం చేయాలనే సదుద్దేశ్యంతోనే తాము దానిని విభజన చట్టంలో పొందుపర్చామన్నారు.

అమె మాట్లల్లోనే.. ‘ముందుగా లెమాటి వెంకయ్య (గుండెపోటుతో మృతి చెందిన చలోఢిల్లీ బృందంలోని సభ్యుడు) కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నా. అంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం అసువులు బాసిన వీరులను స్మరించిన అమె.. హోదా మన హక్కు అని ధైర్యంగా పోరాడాలి. ఈ విషయంలో ఎవరూ మనస్తాపం చెందకూడదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు మీరు కోటి సంతకాల సేకరణ, మట్టి, నీళ్లు సేకరించి తీసుకొచ్చి పోరాడుతున్న తీరుకు అభినందనలు.

ఆంధ్ర ప్రదేశ్ విభజన సందర్భంగా ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పన్ను రాయితీలు, పోలవరం ప్రాజెక్టు తదితర అనేక అంశాల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అండగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ అమలు చేయాల్సిందిపోయి అనిశ్చితిలో పడేసింది. అటు టీడీపీ, ఇటు బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తున్నాయి. ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు ప్రకటన చేస్తారనుకుంటే ఏపీకి నీళ్లు, మట్టి ఇవ్వడం బాధాకరం. మేమంతా మీవెంట ఉంటాం. పార్లమెంటులోనూ, వెలుపలా పోరాడుదాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దాం..’ అని పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు విభజన చట్టం హామీలతోపాటు నాడు రాజ్యసభలో తానిచ్చిన ప్రత్యేక హోదా హామీని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కోరారు. ఆంధ్రపద్రశ్ కు ప్రత్యేక హాదా విషయంలో ఆనాడు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. హోదా వచ్చే వరకూ పోరాడుదామని, విభజన హామీలు నెరవేరే దాకా ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.

కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం పెద్దమార్పు చోటు చేసుకుంది. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏపీకి అండగా ఉంటామన్నాం. కానీ దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సాయపడడం లేదు. స్పెషల్ స్టేటస్ కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనేందుకు నేను కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాను. కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదు’ అని పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles