High Court Dismiss the Suspension of MLA Roja From Assembly

High court dismiss the suspension of mla roja from assembly

Roja, High Court, Assembly, YSRCP, Kodela Shivaprasad, RK Roha, Nagari MLA Roja

High Court issue notices to Assembly seceretry to Allow Roja for assembly sessions.

ITEMVIDEOS: రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేసిన హైకోర్టు

Posted: 03/17/2016 11:12 AM IST
High court dismiss the suspension of mla roja from assembly

నగరి ఎమ్మెల్యే ఆర్.కె రోజాకు అనుకూలంగా హైకోర్టు తీర్పువెలువడింది. అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన కారణంగా ఏడాదిపాటు సభ నుండి సస్పెన్షన్ కు గురైన రోజా తనకు అన్యాయం చేశారని పేర్కొంది. తన సంజాయిషీ కూడా తీసుకోలేదని.. చివరకు తనకు ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేదని ఆమె వివరించారు. అయితే దీని మీద హైకోర్టును ఆశ్రయించగా. హైకోర్టు రిజిస్ట్రార్ దీన్ని విచారణకు స్వీకరించలేదు. కాగా రోజా మాత్రం పట్టువదలకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో హైకోర్టు రోజా సస్పెన్షన్ కేసును విచారించింది. చివరకు రోజాకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

నిన్న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు ఎనిమిది గంటల పాట సుదీర్ఘంగా సాగిన వాదనల్లో రోజా తరపు న్యాయవాది బలంగా వాదించారు. రోజా సస్పెన్షన్ విషయంలో స్పీకర్ సభ సంప్రదాయాలను విస్మరించారని వాదించారు. సభలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అనుచితంగా ప్రవర్తిస్తే ఒక రోజు మాత్రం సస్పెండ్ చెయ్యాలని... అలా కాకుండా సభ్యలు అనుమతితో ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చెయ్యవచ్చు కానీ ఇలా ఏడాదిపాటు సస్పెన్షన్ వేసే అధికారంలేదని రోజా తరఫు లాయరు వాదించారు. తన క్లయింట్ కు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా స్పీకర్ కార్యాలయం అనైతికంగా వ్యవహరించిందని అన్నారు. కాగా దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో రొజా హాజరు కావయచ్చని తెలిపింది. కాగా మిగిలిన విచారణను నాలుగు వారాల తర్వాత కొనసాగిస్తామని హైకోర్టు వెల్లడించింది.

Read Also: వస్తున్నానంటున్న రోజా

Read Also: యనమల చేసిన తప్పే రోజాకు కలిసివచ్చింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  High Court  Assembly  YSRCP  Kodela Shivaprasad  RK Roha  Nagari MLA Roja  

Other Articles