Donald Trump favours Indian students staying back in US

Donald trump favours indian students staying back in us

Indians, Donald Trump, America, USA, USA Elections

Indians studying in American educational institutions should not be kicked out as the country needs smart people like them, Republican presidential front-runner Donald Trump has said as he sought to set the record straight about his immigration policies.

ఇండియన్స్ కు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మంచి మాట

Posted: 03/15/2016 03:41 PM IST
Donald trump favours indian students staying back in us

అమెరికా రాజకీయాల్లో కంపుకంపురేపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి వివాదం రేపు ఎలాంటి ప్రకటన చేయలేదు.. కానీ మన ఎన్నారైలకు అనుకూలంగానే వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికాలో ఎవరిని కాలుమోపనివ్వను అని ప్రకటన చేసిన ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ రోజు ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో  భారతీయ విద్యార్ధులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇమ్మిగ్రేషన్ విధానానికి మద్దత్తును ప్రకటించినట్లయింది.

అమెరికా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి తెలివైన పిల్లలను అమెరికాలో ఉంచాలని అన్నారు. భారత్‌ నుంచి వచ్చిన విద్యార్థులు హార్వర్డ్‌ కు వెళతారని,  ర్యాంకులు తెచ్చుకుని భారత్‌ కు వెళ్లి కంపెనీలు పెట్టి వృద్ధిలోకి వస్తారని ఆయన అన్నారు. ఇటువంటి వారి అవసరం అమెరికాకు ఉందని ఆయన చెప్పారు. ఎంతోమంది ఏళ్ల తరబడి ఇక్కడ చదువుకుంటున్నారని, వారందరినీ బయటకు పంపించొద్దనేది తన ఉద్దేశం అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indians  Donald Trump  America  USA  USA Elections  

Other Articles