MP Rammohan naidu behind thd demolition o constructions in srikakulam

Rammohan naidu hulchul in srikakulam

Rammohan naidu, TDP Leader, srikakulam MP, hulchul, court, statusco, revenue officials, Rammohan naidu demolished constructions, grama kantam land, Rammohan naidu forced for locals to sell thier land

Tdp leader and srikakulan member of parliament demolished the constructions of locals beside his land with the help of revenue officials, after forcing them to sell their land

అధికార ముసుగులో పార్లమెంటు సభ్యుడి దౌర్జన్య పర్వం

Posted: 03/15/2016 02:14 PM IST
Rammohan naidu hulchul in srikakulam

ప్రతిపక్షంలో వుండగా, ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అనే నేతలు.. అధికారంలోకి రాగానే అదే ప్రజలపై తమ జులుం ప్రదర్శిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే వారిని ఓటర్లుగా పరిగణించి కాళ్లు వేళ్లు పట్టుకుని ఓట్లు అడిగే నేతలు గెలిచి అధికార ఫీఠాలను అధిరోహిస్తే.. వారిపైనే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. తమ కన్ను పడిన భూములన్నింటినీ సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వారి దౌర్జన్యానికి లొంగని ప్రజలపై అధికారులతో హుకం జారిచేయించి మరీ తమ అధిపత్యాన్ని చాటుకుంటున్నారు.

ఇందుకు స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు కె.రామ్మోహన్నాయుడు మంగళవారం దౌర్జన్యానికి దిగారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో గ్రామ కంఠాల భూ కబ్జాకు యత్నించారు. అందులోభాగంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్థలం పక్కనే ఉన్న భూమిలో నిర్మాణం జరగుతున్న ఇల్లును కూల్చివేశారు. అయితే ఎంపీ రామ్మోహన్ గతంలో తన స్థలం అడిగారని... అందుకు తాను నిరాకరించానని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీ రామ్మోహన్నాయుడు దౌర్జన్యానికి దిగారని బాధితుడు ఆరోపించారు.

గ్రామకంఠం కింద ఎంపీ రామ్మోహన్నాయుడుకు శ్రీకాకుళంలో 40 సెంట్ల స్థలం ఉంది. అలాగే రెండు, మూడు సెంట్ల గ్రామ కంఠానికి చెందిన స్థలంలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఆ భూములు విక్రయించాలని ఎంపీ... స్థానికులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు వారు ససేమీరా అన్నారు. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ స్థానిక ఎమ్మార్వో చెప్పడంతో.. స్థానికులు కోర్టుకు వెళ్లారు. దాంతో కోర్టు స్టేటస్ కో విధించింది. ఆ క్రమంలో రామ్మోహన్రావు రంగంలోకి దిగారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rammohan naidu  TDP Leader  srikakulam MP  hulchul  

Other Articles