Female plane passengers filmed trading blows in vicious fight

Female plane passengers filmed trading blows in vicious fight

Fight, Fight in Flight, Spiri Airlines, Losangels

Five women were filmed pulling each other's hair and screaming as a fight broke out on board a plane over a boom box speaker.The fight erupted when two woman on the Spirit Airlines Flight 141 from Baltimore to LA, started blasting out tunes, according to reports.

ITEMVIDEOS: ఏకంగా విమానంలో కొట్టుకున్న మహిళలు

Posted: 03/14/2016 03:43 PM IST
Female plane passengers filmed trading blows in vicious fight

ఆడవాళ్లు ఎందులోనూ తీసిపోరు... అందునా మరో ఆడదానితో గొడవకు దిగడం అంటే అంతే సంగతులు. ఈ మధ్యన మగవారికంటే మహిళలలే ఎక్కడపడితే అక్కడ కొట్టుకోవడం చూస్తూవున్నాం. మనం చాలాసార్లు బస్సుల్లో, ట్రైన్స్ లో మనం కొట్టుకోవడం చూసాం కానీ ఇపుడు విమానంలోనూ కొట్టుకోవడం దర్శనమిస్తోంది. తాజాగా బాల్టిమోర్ నుంచి లాస్‌ ఏంజిల్స్ వెళ్ళిన స్పిరిట్ ఎయిర్‌ లైన్స్‌ లో ఇద్దరు మహిళలు ఫుల్‌గా మద్యం తాగి పెద్ద శబ్దంతో బూమ్ బాక్స్‌లో మ్యూజిక్ ప్లే చేశారు. దీంతో చుట్టూవున్న ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ సౌండ్ తగ్గించాలంటూ రిక్వెస్ట్ చేశారు.

వాళ్ళు వినకుండా మరింత సౌండ్ పెంచేశారు. ఇలా మాటల యుద్ధం జరుగుతుండగానే.. ఫ్లయిట్ లాస్‌ఏంజిల్స్‌‌లో ల్యాండ్ కావడానికి రెడీ అయ్యింది. ఈలోగానే ఐదుగురు మహిళలు.. ఆ తాగుబోతుల దగ్గరకెళ్లి గొడవకు దిగారు. అక్కడితో ఆగకుండా ఆ మహిళలందరూ జుట్టు పట్టుకుని ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ చితక్కొట్టుకున్నారు. చివరకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించి ఓ వ్యక్తి ఈ తతంగాన్ని తన ఫోన్ ద్వారా షూట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fight  Fight in Flight  Spiri Airlines  Losangels  

Other Articles