Young woman gang-raped in UP’s Rae Bareli

Bus driver conductor booked for gang rape in bareilly

rape, woman raped, Woman Gang rape, Bus, Baby Die, rar bareli, uttar pradesh, Khajuria village, Shahi, Shishgarh, Rampur, Shishgarh police station, R.K. Bhardwaj, molestation on women, attrocities on women, harrassment on women,

In a shocking incident on International Women’s Day, a young woman was gang-raped in a bus in Rae Bareli in Uttar Pradesh. Her 14-day-old infant died after falling from her lap as she tried to escape her tormentors

యూపీలో దారుణం.. పచ్చిబాలింతరాలిపై గ్యాంగ్ రేప్.. పసికందు మృతి

Posted: 03/09/2016 01:46 PM IST
Bus driver conductor booked for gang rape in bareilly

ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పచ్చి బాలింతరాలని కూడా చూడకుండా మహిళపై ఇద్దరు దుండగులు పైశాచిక మృగాల కంటే ఘోరంగా ప్రవర్తించారు. బస్సులో తన ఇద్దరి పిల్లలతో ప్రయాణిస్తున్న ఒంటరి మహిళపై.. కామంతో కళ్లు మూసుకుపోయిన బస్సు డ్రైవర్, కండెక్టర్ సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ మగమృగాళ్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో ఆమె ఒడి నుంచి 14 రోజుల పసికందు జారిపడి మరణించాడు. అయినా కనుకరించనా కామాంధులు అమెపై అత్యాచారం జరిపి నిర్మూనుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లారు.

రామ్ బరేలీ సూపరింటెండెంట్ పోలీసు అధికారి ఆర్కే భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్పూర్కు చెందిన 28 ఏళ్ల యువతి తన ఇద్దరు పిల్లలతో కలసి రాయ్ బరేలిలోని సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి రాయ్పూర్కు తిరిగి వెళ్లేందుకు ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తూ ఆమె నిద్రపోయింది. బస్ స్టాప్లో మిగతా ప్రయాణికులందరూ దిగిపోగా నిద్రమత్తులో ఉన్న ఆమె గమనించలేదు. అలానే తన ఇద్దరు పిల్లలతో బస్సులోనే ప్రయాణించింది.
 
కోద్ది దూరం వెళ్లిన తరువాత అమెను గమనించిన డ్రైవర్, కండక్టర్.. పచ్చి బాలింతరాలన్న కనికరం కూడా లేకుండా అమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వారిని ప్రతిఘటించి, అత్యాచారం నుంచి తప్పించుకునే క్రమంలో జరిగిన పెనుగులాటలో అమె ఒడిలోని 14 రోజుల బిడ్డ కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. అయినా మగమృగాళ్లు అమెను వదలకుండా అత్యాచారం జరిపారు. ఆ తరువాత బస్సు డ్రైవర్, కండెక్టర్ ఆమెను రోడ్డుపై దించివేసి వెళ్లిపోయారు.

నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా పసికందు మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు, బాధితురాలిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు. అయితే నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిపై 14 రోజుల పసికందు మరణానికి కారణమైన చట్టాలతో కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియలేదు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు చేసుకోగా.. ఆమెకు మరచిపోలేని పీడకలను మిగిల్చింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  woman raped  Woman Gang rape  Bus  Baby Die  rar bareli  uttar pradesh  

Other Articles