AP Minister Ravelas Son Lands in Eve-teasing Controversy in Hyderabad

Ap minister ravelas son lands in eve teasing controversy in hyderabad

Ravela Kishore Babu, Ravela Susheel, Banjarahills, Hyderabad

At a time when Social Welfare Minister Ravela Kishore Babu is trying hard to refute the allegations levelled against him by the YSRC over land purchases in the new capital region, his son Susheel ran into a controversy after a 20-year-old woman teacher had alleged that Susheel and his driver misbehaved with her in Hyderabad.

మహిళను వేధించిన మంత్రి రావెల కొడుకు

Posted: 03/05/2016 08:59 AM IST
Ap minister ravelas son lands in eve teasing controversy in hyderabad

ఏపి మంత్రి రావెల కిశోర్ తనయుడు పోకిరీ వేషాలు వేశారు. మహిళను వేధించడంతో స్థానికులు మంత్రిగారి కొడుకుకు దేహశుద్ది చేశారు. రావెల కిశోర్ బాబు కొడుకు సుశీల్ కుమార్ తాజాగా వేసిన పోకిరీ వేషాలు వెలుగులోకి రావడంతొ రావెల మీద విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 13లో ఈ సంఘటన జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం... ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ... గురువారం సాయం త్రం తన ఇంటికి బయలుదేరింది. ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారులో సుశీల్‌ ఆమెను వెంబడించాడు. కొద్దిదూరం వెళ్లాక సుశీల్‌ ఆమె చేయిపట్టుకుని లాగాడు. ఆ మహిళ బిగ్గరగా అరవడంతో స్థానికులు పోగయ్యారు. ఆమె భర్త కూడా అక్కడకు చేరుకున్నాడు. జరిగింది తెలుసుకున్న స్థానికులు సుశీల్‌తోపాటు కారు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. వారిని పోలీసులకు అప్పగించి... ఫిర్యాదు చేశారు.

సుశీల్ ఏపీ మంత్రి రావెల్ కిశోర్ కుమార్ కొడుకు అని తెలియడంతో పోలీసులు అతడిని కేసు నుంచి తప్పించే యత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విషయం మీడియాకు పొక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం డ్రైవర్‌పైనే లైంగిక వే ధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. కిశోర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. డ్రైవర్‌ను కూడా పంపేశారు. అయితే బాధితురాలి బంధువులు మరోసారి స్టేషన్‌కు వెళ్లి కేసుపై ఆరా తీశారు. నిందితులు ఎక్కడంటూ నిలదీశారు. మరోవైపు... సుశీల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఆయన తండ్రి వద్ద పనిచేసే మణికొండ రమేశ్‌ అనే వ్యక్తి పోలీసులు రాత్రి పదిగంటలకు ఫిర్యాదు చేశారు. కారును కూడా ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravela Kishore Babu  Ravela Susheel  Banjarahills  Hyderabad  

Other Articles