Woman 'bites' off lover's tongue during passionate kiss, arrested

Woman chops off boyfriend s tongue during passionate kiss

Shakeia Long, Williams, kiss, biting off, tongue, charged with first-degree assault. boyfriend's tongue, passionate kiss, St. Francis Hospital,

A woman has been arrested after allegedly biting off her boyfriend's tongue during a passionate kiss.

నాలుకను కోసిన అధర చుంబనం.. పరుగులు పెట్టిన ప్రియుడు

Posted: 03/04/2016 07:58 PM IST
Woman chops off boyfriend s tongue during passionate kiss

వ్యసనాల బారిన పడడం, వాటిని నిర్లజ్జగా వెల్లడించడం నేటి యువతరానికి ఫ్యాషన్ అయిపోయింది. అదే విదేశాల్లో అయితే మాదకద్రవ్యాల బారిన పడి విచ్చలవిడిగా ప్రవర్తించడం సర్వసాధారణంగా మారింది. మాదక ద్రవ్యాల మత్తలో మునిగి తేలుతూ గాఢమైన అధర చుంబనంలో విచక్షణను కోల్పోయిన ఓ మహిళ ప్రియుడి నాలుకను కొరికేసింది. హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ప్రియుడు తెగిపోయిన నాలుక ముక్కను చేతబట్టుకొని హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

అమెరికాలోని కనెక్టికట్లో హార్ట్ఫోర్డ్ సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. షకియా లాంగ్(37) అనే మహిళ తన ప్రియుడు డ్వేన్ విలియమ్స్(41)తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఇంట్లో మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకున్న అనంతరం విలియమ్స్ను కిస్ చేస్తూ.. షకియా లాంగ్ అతని నాలుకను కొరికేసింది. ఒక్కసారిగా నాలుక తెగిపోవడంతో బయటకు పరిగెత్తిన విలియమ్స్ అటుగా వెళ్తున్న పోలీసు సహాయంతో ఆసుపత్రికి చేరినట్లు స్థానిక పత్రిక వెల్లడించింది.                    

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షకియాపై కేసు నమోదు చేశారు. ఆ సమయంలో తాను విలియమ్స్ తో కలసి మాదకద్రవ్యాలను సేవించానని, దాని మత్తులోనే అతడి నాలుకను కొరికానని అంగికరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెగిపడిన నాలుకకు వైద్యులు అతికష్టం మీద అతికించారు. ఘటన జరిగిన సమయంలో చాలా రక్తం పోయిందని విలియమ్స్ పోలీసులకు తెలిపాడు. మార్చ్ 31న ఈ కేసుకు సంబంధించి షకియా కోర్టుకు హాజరుకానుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakeia Long  Williams  kiss  biting off  tongue  

Other Articles