Pakistani cricket fan Commits Suicide

Pakistani cricket fan commits suicide

Pakistan, Fan, cricket Fan, cricket fan suicide, Bangladesh

A 50-year-old Pakistani man committed suicide after he bet a month's salary on a cricket match between Pakistan and Bangladesh which his country lost. Muhammad Shafiq, a junior clerk in the Punjab irrigation department, was on Thursday found hanging from a fan in his office, Dawn online reported on Friday.

పాకిస్థాన్ ఓడినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు

Posted: 03/04/2016 05:32 PM IST
Pakistani cricket fan commits suicide

అభిమానం అనేది హద్దలు దాటితే దారుణాలే జరుగుతుంటాయి. తాజాగా ఓ క్రికెట్ అభిమాని పాకిస్థాన్ ఆసియా కప్ లో ఓడిపోవడంతో ప్రాణాలు తీసుకున్నాడు. అభిమానానికి వికృత రూపంలా కొంత మంది అభిమానం ముసుగులో తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. పిచ్చి పీక్స్ లో ఉంటే ఇలాంటి దారుణాలకే ఒడిగడుతుంటారు. పాకిస్థాన్ ఎలాగైనా మ్యాచ్ గెలుస్తుందని.. ఓ క్రికెట్ అభిమాని అందునా పాకిస్థాన్ టీం అభిమాని ఓడిపోవడంతో తన ప్రాణాలను తీసుకున్నాడు.

ఆసియాకప్ లో బంగ్లాదేశ్తో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్లో పాకిస్తాన్ గెలుస్తుందని తన సాలరీని  బెట్టింగ్ కాసిన ఆ దేశ క్రికెట్ అభిమాని పాక్‌ ఓడిపోవడంతో ఆత్మాహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మొహ్మద్ షఫిక్ ఇరిగేషన్ డిపార్టమెంట్లో జానియర్ క్లర్క్ గా పని చేస్తున్నాడు.  క్రికెట్ అభిమాని అయిన షఫిక్ పాకిస్తాన్ జట్టు గెలుస్తుందని అతని నెలవారీ జీతం రూ. 30,000 బెట్టింగ్లో పెట్టాడు. అయితే ఆ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలుకావడంతో జీర్ణించుకోలేని షఫిక్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంగ్లాదేశ్పై పాకిస్తాన్ పరాజయం చెందడంతో పాటు సొమ్మును కూడా పోగొట్టుకోవడమే షఫిక్ ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Fan  cricket Fan  cricket fan suicide  Bangladesh  

Other Articles