JNU students suffering from infection

Jnu students suffering from infection

JNU, JNNU Students, Delhi High court, Kanaiah Kumar

Jawaharlal Nehru University (JNU) students’ union president Kanhaiya Kumar granted an interim conditional bail for six months in a sedition case by the Delhi High Court.. Disposing of the bail petition of a single judge bench of Justice Pratibha Rani stated, “The thoughts reflected in the slogans raised by some of the JNU students, who organised and participated in that programme, cannot be claimed to be protected as fundamental right to freedom of speech and expression. I consider this as a kind of infection from which such students are suffering which needs to be controlled/cured before it becomes an epidemic.

JNU విద్యార్థులకు మహమ్మారి సోకిందా..?

Posted: 03/03/2016 10:03 AM IST
Jnu students suffering from infection

దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల మీద దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జె.ఎన్.యు విద్యార్థులకు ఇన్ఫెక్షన్ సోకినట్టుందని.. మందులకు రోగం కుదరకపోతే శస్త్ర చికిత్స తప్పదని వ్యాఖ్యానించింది ఢిల్లీ హైకోర్టు. దేశద్రోహం కేసులో కన్నయ్య కుమార్ కు బెయిల్ ఇస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ప్రతిభారాణి. దేశద్రోహ కేసులో గత నెల 12న కన్నయ్యతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. వీరు 14 రోజులు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో కన్నయ్యకు 6 నెలల కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ప్రతిభారాణి.

దిల్లీ .వహర్ లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్థుల నినాదాలను పరిశీలిస్తే వారికి ఏదో మహమ్మారి సోకినట్లు తెలుస్తోందని.. ఇది సాధారణ మందులకు లొంగకుంటే శస్త్రచికిత్స చేయడమే పరిష్కారమన్నారు న్యాయమూర్తి. జేఎన్ వర్సిటీలో జాతివ్యతిరేక నినాదాలను పరిశీలిస్తే.. అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపే విధంగా ఉన్నాయన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ.. రాజ్యాంగానికి లోబడే ఉంటుందని తెలిపారు. శరీరంలో ఏ అవయవానికైనా ఇన్ఫెక్షన్ సోకితే మొదట యాంటీబయాటిక్స్ ఇస్తారని… వీటికీ లొంగకుండా అవయమంతా ఇన్ఫెక్షన్ సోకి కుళ్లిన పుండులా తయారైతే అవయవాన్ని తీసేయక తప్పదని అభిప్రాయపడింది కోర్టు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNU  JNNU Students  Delhi High court  Kanaiah Kumar  

Other Articles