Why Narendra Modi against AP, here's why

Why narendra modi against ap here s why

Modi, Union budget 2016, Modi against AP, AP political news

Prime Minister Narendra Modi was strictly against AP, the sources say. Here are the reasons the sources said.

ఏపికి మోదీ సర్కార్ ఎందుకు నిధులు ఇవ్వడం లేదంటే..?

Posted: 03/01/2016 04:07 PM IST
Why narendra modi against ap here s why

ఇక్కడ రాష్ట్రంలో నేను (చంద్రబాబు నాయుడు) కేంద్రంలో మోదీ ఉంటే అటు దేశం, ఇటు రాఫ్ట్ర్రం ఎదురులేకుండా అభివృద్దిని సాధిస్తుందని చంద్రబాబు ఎన్నికల సందర్భంగా బీరాలకు పోయారు. ఇక కేంద్రంలో మోదీ సర్కార్, పిలో చంద్రబాబు నాయుడు సర్కార్ అధికారంలోకి వచ్చాయి. అయితే ప్రధాని మోదీ ఏపికి పూర్తి మద్దతునిస్తారని అందరూ ఊహించారు. కానీ నిజానికి ఇక్కడ జరుగుతున్నది మాత్రం వేరే ఉంది. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపికి మా పూర్తి మద్దతు ఇస్తాం... ప్రత్యేక హోదా అనే పదం వాడుకుండా.... ప్యాకేజ్ కన్నా ఎక్కువ నిధులు ఇస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. అయితే అరుణ్ జైట్లీ రెండోసారి మోదీహయాంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కానీ ఏపికి మాత్రం మొండి చేయి చూపించారు. అయితే దీనికి కారణం ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడే అని బిజెపి నాయకులు అనుకుంటున్నారు.

Also Read: చంద్రబాబు గూబ గుయ్ మనిపిస్తారు: జగన్

యునియన్ బడ్జెట్ 19.78 లక్షల కోట్లతో రూపొందించినా కానీ అందులో ఏపి రాష్ట్రానికి మాత్రం ఎగింలి చేయిని విదిలించినట్లు విదిలించారు అరుణ్ జైట్లీ. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపికి పూర్తి బాసటగా కేంద్రం ఉంటుంది అనుకుంటే.. మొత్తం అంచనాలు తారుమారయ్యాయి. అనుకున్నది ఒక్కటి అయిందొక్కటి అన్నట్లు మారింది. చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అనుకున్న దానికన్నా ఎక్కువే నిధులు వస్తాయని అందరూ ఊహించారు. కానీ ఉసూరుమనిపిస్తు.. పోలవరానికి ఓ వంద కోట్లు, మెట్రో పేరుతో మరో వంద కోట్లు మిగిలిన విద్యాసంస్థల పేరుతో నామమాత్రపు నేనిధులతో  మమ అనిపించారు.


మోదీకి, చంద్రబాబు నాయుడుకు మంచి మైత్రి ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండే చంద్రబాబుకు మోదీతో స్నేహం ఉంది. మోదీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగానే.. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందుగానే పొత్తుకు సిద్దమయ్యారు. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకుంటే.. ప్రాధాన్యత ఎక్కువ లభిస్తుందని చంద్రబాబు నాయుడు ముందుగా ఊహించారు. కానీ పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. మోదీ సర్కార్ ఏపికి నిధులు కేటాయించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. విభజన ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఏపిని ఆదుకోవాల్సిన కేంద్రం అసలు పట్టించుకోకుండా వదిలేసింది.

Also Read: ముద్రగడ నోట.. చంద్రబాబు మాట.. నిద్రపోనూ.. నిద్రపోనివ్వనూ..

1.ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారని...

ఏపిని అభివృద్ది తీరాలకు చేరవేస్తాం.. ఇక చూడండి అంటూ ఏవేవో మాట్లాడిన చంద్రబాబు నాయుడు బడ్జెట్ నిధులను చూసిన తర్వాత అవాక్కయ్యారట. రెండో బడ్జెట్ లో కూడా ఏపికి నిధులు కేటాయించకపోవడం మీద అసహనం వ్యక్తం చేశారట. కాగా ఏపికి నిధులు కేటాయించకపోవడానికి వేరే కారణాలున్నాయని బిజెపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికార మధంతో నిస్సుగ్గుగా, యధేచ్చగా జరుగుతున్న దోపీడీకి... ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకూడదని నిధులివ్వడంలేదని దిల్లీలో బిజెపి వర్గాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

2.అసలు కారణం చంద్రబాబే...

ఇక బడ్జెట్ ను చూసిన సామాన్యులు మాత్రం అసలు కారణం చంద్రబాబు నాయుడే అని అనుకుంటున్నారట. ఎందుకు అలా అనుకుంటే... రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అంటూనే.. విపరీతమైన విలాసాలకు పోతున్నరని అందరికి తెలుసు. హంగు ఆర్భాటాలకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారని చాలా మంది అనుకుంటున్న మాట. మావాడు అనే అభిమానంతో కాకపోయినా.. కనీసం విభజనలో బాగా నష్టపోయిందన్న అభిమానంతో అయినా నిధులు పెంచుతారు అనుకుంటే అస్సలు లేదు.

Also Read: ఏపికి ప్యాకేజీ కాదు కదా.. నిధులు కూడా తక్కువే

 

3.ఓ వర్గానికి మాత్రమే చేస్తున్న బాబు....

ఇక చంద్రబాబు నాయుడు పక్షపాత వైఖరి ఎక్కువగా ప్రదర్శిస్తున్నారని స్వయంగా తెలుగుదేశం నాయకులు కూడా అనుకుంటున్నారట. అందుకే ఓ వర్గానికి చెందిన వారికి మాత్రమే ప్రాజక్టులను కేటాయిస్తున్నారని అంటున్నారు. ప్రతి ప్రాజెక్టును తమ వారికే చెందేలా చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారని కూడా అంటున్నారు. ఇక జనాల్లో ఇప్పటికే పట్టిసీమ పేరుతో దోపిడీకి దిగారని ప్రతిపక్షాలు చేస్తున్న విషయం మీద సీరియస్ గా చర్చిస్తున్నారు. ఇక రాజధాని పేరుతో వేలాది ఎకరాల భూమిని సేకరించే పేరుతో భూదందాకు దిగినట్లు విమర్శలు వస్తున్నాయి.

 

4.దోపిడీకి కేరాఫ్ గా చంద్రబాబు సర్కార్...

రాజధాని నిర్మాణం కోసం అంటూ వేలాది ఎకరాల భూమిని సేకరించి... రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతున్నారని ప్రతిపక్షాలు ఇప్పటికే గగ్గోలుపెడుతున్నాయి. ఇక రాజధాని శంఖుస్థాపన పేరుతో చేపిన హడావిడి.. చేసిన దుబారా గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది, ఇక రాష్ట్రంలో ఇసుక దోపిడీ గురించైతే.. మంత్రులు, తెలుగుదేశం నాయకులే విమర్శిస్తున్నట్లు ఆఫ్ ది రికార్డ్ లో వెల్లడిస్తున్నట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఇక అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు సర్కార్ కు ముచ్చెమటు పట్టించిన ఓటుకు నోటు కేసు పెద్ద సంచలనంగా మారింది. 



5.ఓటుకు నోటు కేసు కోసం....

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనానికి తెర తీసిని ఓటుకు నోటు వ్యవహారంలో కేసు నుండి తప్పించుకునేందుకు అన్నట్లు చంద్రబాబు నాయుడు మోదీ దగ్గరికి పరుగెత్తారు. మీడియాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న లాబీయింగ్ అంటూ కథనాలు ప్రసారమయ్యాయి. మోదీ దగ్గరికి చంద్రబాబు ఓటుకు నోటు కేసులో పదేపదే తిరగడం వల్ల మోదీ దగ్గర ప్రాధాన్యత పోగొట్టుకున్నారని కూడా బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా పద్మ అవార్డుల విషయంలో కూడా చంద్రబాబు తమ వర్గానికి చెందిన వారికి మాత్రమే కేటాయించాలంటూ చేసిన లాబీయింగ్ మీద కూడా మోదీ గుర్రుగా ఉన్నారని దిల్లీ వీధుల్లో చర్చసాగుతోంది.

6.పోలవరంకు నిధులు ఏవి..

ఇక బడ్జెట్ లో జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. అంత పెద్ద ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. వంద కోట్లతో అసలు ప్రాజెక్టులో ఏ మేరకు కూడా చాలవని అందరికి తెలుసు అయినా కూడా బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే మాత్రం షాకే. దానికి  రకంగా చంద్రబాబు నాయుడు సర్కారే కారణం అని అంటున్నారు విమర్శకులు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను 16000కోట్ల నుండి అమాంతంగా 36000 కోట్లకు పెంచి పంపడంతో కేంద్రం అపహనానికి గురైందని కూడా తెలుస్తోంది. అందుకే ముందుకే మోసం వచ్చిందని వారు అంటున్నారు.

7.కాపు ఉద్యమం దెబ్బ...

తాజాగా ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన కాపు ఉద్యమం కూడా మోదీ దగ్గర చంద్రబాబుకు ఇంప్రెషన్ పోయిందని బిజెపి నాయకులు అనుకుంటున్నారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని ముందుగా ప్రకటించి.. తర్వాత మాత్రం దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో చంద్రబాబు నాయుడుకు విశ్వాసం తగ్గిందని కూడా మోదీకి తెలుసు అని అందుకే చంద్రబాబు నాయుడుకు పెద్దగా ప్రాధాన్యతనివ్వడం లేదని అంటున్నారు.

8.దుబారా ఖర్చులు, విలాసాలు....

రాష్ట్రం అసలే కష్టాల్లో ఉంది.. కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవు అని ఎంతో విచారంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కానీ లేపాక్షి ఉత్సవాలకు మాత్రం తమ వారికి మేలు చెయ్యడానికి నిధులు వచ్చాయి. తినడానికి తిండి లేకుంటే మీసాలకు సంపెంగ నూనె అన్పట్లు కేవలం తమ, తమ వర్గానికి చెందిన వారి ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు బాగా ఆరాటపడుతున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

9.కేంద్రం ఇచ్చినా క్రెడిట్ మాత్రం సున్నా..

ఇక చంద్రబాబు నాయుడు అసలు మేనేజ్ మెంట్ అంటే ఏంటో బాగా తెలుసు. గోరంత ఉన్నా దాన్ని బూతద్దంలో చూపించి.. కొండంత చూపించడం... లేనిది ఉన్నట్లు చూపించడం చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని ఆయనను దగ్గరి నుండి చూసిన చాలా మంది చెప్పే మాట. తాజాగా అదే ఏపి ప్రభుత్వానికి నిధులు కేటాయించకుండా చేసిందని బిజెపి నాయకులు అనుకుంటున్నారు. అయినా చంద్రబాబు నాయుడు మోదీ దగ్గర ఇంప్రెషన్ పోగొట్టుకొని... ఇప్పుడు మాత్రం నిధులు లేవు అని బాధపడితే మాత్రం చాలా కష్టం. అయినా అన్నీ తెలిసిన చంద్రబాబు ఇలా మోదీ సర్కార్ దగ్గరి నుండి కాసులు రాబట్టలేకనోవడం ఓ రకంగా ఆయన అపజయమే అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే మరికొంత మాత్రం చంద్రబాబు నాయుడు ఏపికి ముఖ్యమంత్రి ఉన్నన్నాళ్లు కేంద్రం నుండి నిధులు రావు అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Union budget 2016  AP political news  

Other Articles