Telangana Minister KTR said that fill the vaccancies in the HMDA through TSPSC

Telangana minister ktr said that fill the vaccancies in the hmda through tspsc

Telangana, Hyderabad, HMDA, TSPSC, HMDA Jobs

Telangana Minister KTR said that fill the vaccancies in the HMDA through TSPSC. He said that they will complete LRS, BRS in this year.

టిఎస్పిఎస్సీ ద్వారా హెచ్ఎండీఏ ఖాళీలను భర్తీ

Posted: 03/01/2016 11:55 AM IST
Telangana minister ktr said that fill the vaccancies in the hmda through tspsc

టిఎస్పిఎస్సీ ద్వారా హెచ్ఎండీఏ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ ప్రక్రియను ఏడాదిలో పూర్తి చేయాలని డిసైడైంది. 100 రోజుల ప్రణాళికపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు మంత్రి కేటీఆర్. క్రమబద్ధీకరణ కోసం లక్షా 60 వేల అప్లికేషన్లు వచ్చాయన్న మంత్రి … పారదర్శకంగా ప్రాసెస్ పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి ఆన్ లైన్ అవనుమతుల సేవలు ప్రారంభిస్తామన్నారు. మే నెలలో షామీర్ పేట్ నుంచి ఘట్ కేసర్ మీదుగా వెళ్లే  అవుటర్ రింగ్ రోడ్డును సీఎం ప్రారంభిస్తారన్నారు మంత్రి. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ అంతర్జాతీయ స్ధాయి సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం కోసం అనుమతులు ఒకటి రెండు రోజుల్లో ఇస్తామన్నారు. ఆ తర్వాత  షార్ట్ టెండర్ ద్వారా పనులు మొదలు పెడతామన్నారు.

మున్సిపాలిటీల్లో పన్నుల వసూలుపై ప్రజలను చైతన్యవంతం చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్.  ప్రజలతో సంబంధాలపై గ్రేటర్ కార్పొరేటర్లకు శిక్షణ ఇప్పిస్తామన్నారు మంత్రి. నగరంలోని బీటీ రోడ్డు పనులు, నాలల పుడిక తీత, బస్ బేలు, మార్కెట్ల నిర్మాణాల పనులపై రివ్యూ చేశారు. హెచ్ఎండబ్లుఎస్ఎస్ లక్ష్యాల పైనా చర్చించారు. గృహవసరాల కోసం తీసుకుని కమర్షియల్ గా వాడుతున్న నల్లా కనెకక్షన్లు రెగ్యూలరైజ్ చేసుకునేందుకు  ఓ పథకాన్ని ప్రకటిస్తామన్నారు మంత్రి. అక్రమంగా వాడుకుంటున్న వినియోగాదారులు నెల రోజుల్లోపల కేటగిరీలు మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి బిల్డింగ్ కి ఇంకుడు గుంతలుండాలన్న నిబంధనలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్కిళ్లు, డివిజన్ల వారీగా బోర్లు, చేతిపంపుల వివరాలు సేకరించాలన్నారు మంత్రి. వాటి దగ్గర  ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. 100 రోజుల్లో 1000 ఇంకుడు గుంతలు నిర్మిస్తామన్నారు. పార్కులు, ఖాళీజాగాలున్న దగ్గర ఈ నిర్మాణాలు చేపడతామన్నారు.  బోడుప్పల్  తో పాటు అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 194 గ్రామ పంచాయితీలకి నీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు కేటీఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Hyderabad  HMDA  TSPSC  HMDA Jobs  

Other Articles