Mixed bag budget with no big idea: Manmohan Singh on Union Budget

Mixed bag budget with no big idea says manmohan singh

manmohan singh on arun jaitley budget, manmohansingh arun jaitley, former prime ministger manmohansingh,Budget 2016-17,Arun Jaitley,Manmohan Singh,Budget 2016 Live,Budget,budget live coverage,budget speech 2016, economist manmohan singh,

Former Prime Minister Manmohan Singh today said the government had unveiled a "mixed bag Budget" with no big idea.

బడ్జెట్.. ఎలాంటి ఐడియా లేని కలగూర గంప.. మాజీ ప్రధాని విమర్శ

Posted: 02/29/2016 04:14 PM IST
Mixed bag budget with no big idea says manmohan singh

కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ ఎలాంటి పెద్ద ఐడియా లేని ఓ కలగూర గంపగా వుందంటూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శించారు. బడ్జెట్ ముందురోజున ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించిన రైతుల ఆదాయాన్ని రానున్న ఐదేళ్లలో రెండింతలు చేస్తామన్న ఉద్దేశ్యం తప్ప జైట్లీ బడ్జెట్ లో ఎలాంటి గొప్ప విషయాలు లేవన్నారు. భారత భవిష్యత్తుకు పెద్దగా ఉపయోగం లేని అంతంతమాత్రపు బడ్జెట్ ను అరుణ్ జైట్లీ సుకువచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక రైతుల ఆదాయాన్ని రానున్న ఐదేళ్లలో రెట్టింపు చేస్తామని పేర్కొనడం అసాధ్యమైన ఆలోచనగా సింగ్ దుయ్యబట్టారు. ఇది సాకారం కాని కల వంటిదని ఆయన పేర్కోన్నారు. ఒకవేళ సాధించగలమని ప్రభుత్వం భావిస్తే, ఎెలా సాధిస్తారన్న మార్గాలను చెప్పుండేవారని ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లూ సాలీనా 14 శాతం వ్యవసాయ రంగంలో వృద్ధి నమోదైతే తప్ప రెట్టింపు ఆదాయం అసంభవమని అన్నారు. కేవలం 2 నుంచి 3 శాతం వృద్ధికే పరిమితమైన వ్యవసాయ వృద్ధిని, జీడీపీని మించిన స్థాయికి ఎలా తీసుకెళ్లగలరో చెప్పాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు.

అయితే, గత సంవత్సరం ఆయన నిర్ధేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను, ద్రవ్యోలోటు లక్ష్యాలకు జైట్లీ కట్టుబడి వాస్తవ పరిస్థితి క్లిష్టంగా ఉందని అంగీకరిస్తున్న సంకేతాలు పంపారని, ఇలా వాస్తవ పరిస్థితులను అంగీకరించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జైట్టీ బడ్జెట్ అసెంబ్లీ ఎన్నికల ఎదుర్కోనున్న రాష్ట్రాలను చుట్టూనే తిరిగిందని విమర్శించారు. ప్రస్తుతం ఆహార భద్రత గురించి ఆలోచిస్తున్న పాలకులు, ఆ దిశను వీడి అంతకన్నా క్లిష్టమైన ఆదాయ భద్రత గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manmohan singh  arun jaitley  union budget 2016  income security  

Other Articles