Kanhaiya Kumar was almost disrobed during the attack, Delhi police didn't lift a finger

Beaten almost disrobed in presence of police in court premises claims kanhaiya

kanhaiya kumar, jnusu leader, sedition case, patiala house court, disrobed, incident, anti-national, Delhi Police, JNU, Jawaharlal Nehru University, Nationalism, Patriotism, Sedition, lawyers, police

JNU Students' Union president Kanhaiya Kumar has claimed on camera he was beaten up and almost disrobed by lawyers in the presence of police personnel at the Patiala House Court premises.

నన్ను లాయర్లు చావచితక బాదారు.. అయినా పోలీసులు నిలువరించలేదు..

Posted: 02/27/2016 03:31 PM IST
Beaten almost disrobed in presence of police in court premises claims kanhaiya

పాటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ పై ఎలాంటి ధాడి జరగలేదని సాక్షాత్తు ఢిల్లీ పోలీస్ కమీషనర్ బస్సి ప్రకటన గుప్పించానా.. అదంతా అవాస్తవమని తేలింది. కోర్టు ప్రాంగణంలో తనను లాయర్లు చావ చితకబాదారని, దాదాపుగా దుస్తులు ఊడదీశారని అయినా పోలీసులు నిమ్మకుండిపోయారని బాధితుడు కన్హయ్య కుమార్ ఆరోపించాడు. ఈనెల 17వ తేదీన కోర్టులో అతడిని ప్రవేశపెట్టినప్పుడు లాయర్ల ఘర్షణ జరిగిందని అప్పుడే తనపై దాడి జరిగిందని అన్నాడు.

జాతీయ మీడియా కథనాల ప్రకటారం ఈ వివరాలనింటినీ కన్హయ్య సుప్రీంకోర్టు చెప్పారు. నిందితులను తాను కోర్టులోనే గుర్తించినా.. వాళ్లను పోలీసులు అరెస్టు చేయలేదని కన్హయ్య అన్నాడు. తాను గేటువద్దకు రాగానే మీడియా తనను చుట్టుముట్టిందని, తర్వాత పోలీసులు లోపలకు తీసుకొచ్చారని, తర్వాత న్యాయవాది దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి తనవద్దకు వచ్చిదాడి చేశాడని, 'వాడు వచ్చేశాడు' అని అరుస్తూ మరికొందరు వచ్చి తనపై దాడి చేశారని అన్నాడు. తనపై దాడి చేసినవారిలో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారని కన్హయ్య ఆరోపించాడు. తనపై దాడిచేసిన వ్యక్తిని తాను కోర్టు గదిలో గుర్తించి, అతడిపై ఫిర్యాదు చేస్తానని చెప్పానని, అయితే పోలీసులు మాత్రం అందుకు స్పందించలేదని అన్నాడు. తర్వాత తనను కూర్చోబెట్టి మంచీనీళ్లు ఇచ్చారన్నాడు. తనకు రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉందనే జడ్జికి చెప్పానని వివరించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kanhaiya kumar  jnusu leader  sedition case  patiala house court  disrobed  

Other Articles