Donald Trump Says Indians Are Taking Away Jobs From Americans

Illegal indian immigrants to suffer if trump wins

donald trump, trump indian-americans, indian-americans, donald trump new hampshire, republican, presidential front-runner, indian americans for trump 2016, world news

Donald Trump, the controversial Republican presidential front-runner, has added India to the list of countries that he says are ripping off jobs from the US and has pledged to bring them back if elected president.

అధ్యక్షుడినైతే భారతీయులు వెనక్కే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Posted: 02/27/2016 12:21 PM IST
Illegal indian immigrants to suffer if trump wins

అగ్రరాజ్యం అమెరికాలో నడిరోడ్డులో ఎవరినైనా కాల్చినా.. తనను అమెరికా అధ్యక్షుడిగా కాకుండా చేయగల ధైర్యం ఎవరికీ లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరో మారు సంచలన వ్యాఖ్య చేశారు. అది కూడా ఆయనకు భారత అమెరికన్లు మద్దతు ఇస్తున్న తరుణంలో ఆయన ఏకంగా భారతీయులపైనే తన విషాన్ని కక్కారు. అమెరికాలోని ఉద్యోగాలన్నింటినీ భారతీయులు హరించివేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

హ్యూస్టన్ లో నిర్వహించిన ముఖాముఖి సదస్సులో పాల్గొన్న ఆయన వలస విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే... అమెరికాలోని అక్రమ వలసదారులంతా వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి అమెరికాలోని భారతీయుల సంఖ్యనూ ఆయన ప్రస్తావించారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన 3 లక్షల మంది భారతీయులు సహా 1.10 కోట్ల మంది విదేశీయులు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లి... తిరిగి సుదీర్ఘమైన చట్టబద్ధ ప్రక్రియ ద్వారా రావాలన్నారు. వారిలోనూ ఉత్తమమైన కొందరికే తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  indians  us presidential candidate  america  

Other Articles