He split the TRS party ..?

He split the trs party

TRS, TTDP, TDP, Revanth Reddy, Errabelli dayakar rao, KCR. KTR,Harish Rao

TTDP leader Revanth Reddy said that He split the TRS party. Errabeli Dayakar, who joins TRS recently from TDP, will split TRS Party.

టిఆర్ఎస్ పార్టీని చీల్చేది అతడే..?

Posted: 02/27/2016 11:44 AM IST
He split the trs party

తెలంగాణ రాష్ట్రంలో అప్రతిహతంగా, అజేయంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అదే... టిఆర్ఎస్ పార్టీలోకి వలసలు బారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎదురు నిలిచే ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందుకే ఏ పార్టీల నుండి వస్తున్న వారిని ఐనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుండి స్వాగతం పలుకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన పార్టీల చేరికలు తారా స్థాయికి చేరాయి. ఓ దశలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని చాలా మంది కీలక నేతలను, పార్టీ క్యాడర్ ను టిఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసుకున్నారు. అయితే తాజాగా కొత్తగా చేరుతున్న నాయకులతో పార్టీలో తలనొప్పులు మొదలయ్యాయి.

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అన్నట్లు.. నాయకత్వం కోసం అందరూ పోటీ పడుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దాదాపు టిఆర్ఎస్ పార్టీలో రెండు గ్రూపులు తయారైనట్లు తెలుస్తోంది. తమ పాత మిత్రులను కలుపుకుంటూ కొంత మంది నాయకులు టిఆర్ఎస్ పార్టీ మీద పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన రాజకీయంగా తీవ్ర సంచలనాన్ని రేపుతోంది. టిఆర్ఎస్ పార్టీలో త్వరలోనే చీలకలు వస్తాయని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావులాంటి కీలక నేతలు పార్టీని వీడటంతో తెలంగాణ తెలుగుదేశంలో కాస్త ఆటుపోటులు వచ్చిన మాట వాస్తవం. అయితే ఏదో వత్తిడిలో రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చీలికలు వస్తాయని అనుకుంటే తప్పని అనిపిస్తోంది. ఎందుకంటే అంతకు ముందు నివురు గప్పిన నిప్పులాంటి తగాదాలు కాస్తా తారా స్థాయికి చేరుతాయని.. అలా చేరి చివరకు పార్టీ చీలిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల మధ్య కోల్డ్ వార్ సాగుతోందని చాలా కాలంగా వినిపిస్తున్నా వార్త. ఆధిపత్యం కొసం కేసీఆర్ కొడుకు, మేనల్లుడు పోటీపడుతున్నారని అందరూ గుసగుసలాడుతున్న విషయమే.

టీఆర్ఎస్ పార్టీలోరి చేరిన ఓ మాజీ తెలంగాణ తెలుగుదేశం నేత వల్ల పార్టీలో చీలక వస్తుందని.. ఆయన హరీష్ రావు లేదంటే కేటీఆర్ లలో ఎవరో ఒకరి పక్షాన చేరి పార్టీని చీల్చుతారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయపరంగా సంచలనాన్ని రేపుతున్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు నిజంగా అలానే చేస్తారా..? నిన్నటి దాకా బయటకు కనిపించకుండా ఉన్న విభేదాలను తారా స్థాయికి చేర్చుతారా..? టిఆర్ఎస్ పార్టీ  చీలికలో ఎర్రబెల్లి కీలక పాత్ర పోషిస్తారా ..? అనే ప్రశ్నల సమాధానం కోసం రాజకీయాలను కాస్త లోతుగా చూడాల్సి ఉంది.

ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక స్థానమే ఇచ్చారు. టిటిడిపిలో ఎక్కువగా ప్రాధాన్యత లభించిన వ్యక్తి ఎవరు అంటే అందరూ చెప్పేది ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు. టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, రేవంత్ రెడ్డిల కన్నా చంద్రబాబు ఎర్రబెల్లికే ప్రాధాన్యతనిచ్చారు. కానీ ఆయన మాత్రం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మనుగడలేదని టిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కాగా అంతకు ముందు దొంగచాటుగా ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ తో స్నేహం చేశారు అన్న వ్యాఖ్యలో కూడా నిజంలేకపోలేదు. ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రవర్తించిన తీరును చూసిన ఎవరికైనా ఇది నిజం అనే అనిపిస్తోంది.

ఎర్రబెల్లి దయాకర్ రావు దాదాపుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి మద్దతునిచ్చినట్లు కనిపించింది. ఆయన ప్రజల్లోకి వెళ్లి కనీసం మా పార్టీకి ఓటు వేయండి అని కూడా అడగలేదు. ఏదో ఫర్మాల్టీగా అలా వచ్చి.. ఇలా వెళ్లారు. మరి దొంగచాటుగా టిఆర్ఎస్ కు సహకరిస్తు తెలుగుదేశాన్ని దెబ్బతీసిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. రేపు అదే టిఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయకుండా ఉంటాడా..? అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతకాల్సిందే. ఇప్పటికే టిఆర్ఎస్ లో ఉన్న హరీష్ రావు, కేటీఆర్ విభేదాలను తారా స్థాయికి చేర్చి చివరకు పార్టీని నాశనం చేస్తాడు అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అంతతేలిగ్గా తీసుకోవడానికి వీలులేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  TTDP  TDP  Revanth Reddy  Errabelli dayakar rao  KCR. KTR  Harish Rao  

Other Articles