More than six lakhs for 9999 number

More than six lakhs for 9999 number

Vijayawada, RTA, Bid, 9999 number

In Viajaywada, RTA officials conduct a bid for Vehicle number 9999. A person pay more than six lakh for that number

9999 నెంబర్ కోసం ఆరు లక్షల పైచిలుకు

Posted: 02/25/2016 10:05 AM IST
More than six lakhs for 9999 number

నెంబర్ లో అదృష్టం ఉందని అనుకునే వాళ్లు ఎంతైనా పెట్టడానికి సిద్దపడతారు. తాజాగా 9999 నెంబర్ ను వేలానికి పెడితే ఏకంగా ఆరు లక్షల పైచిలుకు పలకడం వార్తల్లో నిలిచింది. సెలబ్రెటీల నుండి మామూలు వ్యక్తుల వరకు అందరూ కూడా ఫ్యాన్సీ నెంబర్ల మీద మోజు పెరుగుతోంది. తాజాగా  విజయవాడలో 9999 నంబరు కోసం రూ.6,03,000 వేలంలో చెల్లించి సొంత చేసుకున్నారు. ఏపీ డీహెచ్ 9999 నంబరు కోసం ముగ్గురు పోటీపడగా, వారిలో సూపర్‌విజ్ ప్రొఫెషనల్స్ లిమిటెడ్ యజమాని గుప్తా 6,03,000 అధిక మొత్తం కోట్ వేయడంతో వారికి కేటాయించారు.

విజయవాడ నగరంలో ఇంత మొత్తం ఒక నంబరుకు ధర పలకటం ఇదే మొదటిసారి. ఏపీ16 డీహెచ్‌ సిరీస్‌లో 9909 నెంబరు 15 వేలకు, 9919 అనే నెంబర్ .12 వేల రూపాయలకు, 9399 అనే నెంబర్  10 వేల రూపాయలు, ఏపీ 16 డీఎల్‌ 0002 నెంబరు 27 వేలు, ఇదే సిరీస్‌లో 0003 అనే నెంబర్ 41 వేలకు, 0005 అనే నెంబరు 40 వేల రూపాయలకు, 0006 అనే నెంబర్ 46 వేల రూపాయలకు, 0007 అనే నెంబరు 29 వేలకు, 0008 అనే నెంబరు  14 వేలకు వేలంలో అమ్ముడైనట్లు అధికారులు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  RTA  Bid  9999 number  

Other Articles